Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ ఒకే.. మ‌రి మ‌హేష్! సంగ‌తేంటి? రాక్ స్టార్

By:  Tupaki Desk   |   1 July 2022 9:30 AM GMT
ప్ర‌భాస్ ఒకే.. మ‌రి మ‌హేష్! సంగ‌తేంటి? రాక్ స్టార్
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌టౌట్ కి ప్లాట్ కానిది ఎవ‌రుంటారు? అంద‌మైన అమ్మాయిల ద‌గ్గ‌ర నుంచి అబ్బాయి వ‌ర‌కూ డార్లింగ్ ని అంతా అభిమానించే వాళ్లే. 'బాహుబ‌లి' ప్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ద‌గ్గ‌ర నుంచి డార్లింగ్ ఫాలోయింగ్ అంత‌కంత‌కు పెరుగుతోంది. బాలీవుడ్ హీరోయిన్లే ప్ర‌భాస్కి అభిమానులుగా మారిపోయారు.

ఇక న‌వ‌త‌రం భామ‌ల గురించి అయితే చెప్పాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్ సమ్ హీరో ఎవ‌రంటే? మ‌హేష్ పేరునో..ప్ర‌భాస్ నామ జ‌ప‌మో చేయ‌డం చాలా కాలంగా వినిపిస్తున్న‌దే. ఈ ఇద్ద‌రి స్టార్ల‌కి పాన్ ఇండియా వైడ్ గా గాళ్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంద‌ని ప‌లు స‌ర్వేలు సైతం చెప్పాయి. కానీ ఇద్ద‌రి లో బెస్ట్ ఎవ‌రు? అంటే చెప్ప‌డం క‌ష్టం.

ఇద్ద‌రు ఇద్ద‌రే. ఎవ‌రి ప్రత్యేక‌త వారిది. ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో రాక్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్ ని టాలీవుడ్ లో ఏ హీరోకి అభిమానంటే? ఆయ‌న టక్కున డార్లింగ్ ప్ర‌భాస్ అంటూ న‌వ్వేసాడు. ప్ర‌భాస్ హైట్..వెయిట్..మ్యాన్లీ లుక్ ఎంతో బాగుంటుంద‌ని..అందుకే ప్ర‌భాస్ ని అభిమినిస్తాన‌ని చెప్పుకొచ్చారు. బాహుబ‌లి లో అత‌ని లుక్ ఎంతో బాగుంటుంద‌ని...రాజ‌స‌మే ఉట్టి ప‌డుతుంద‌ని..ఆ పాత్ర‌కి ప‌ర్పెక్ట్ ఛాయిస్ అత‌నే అని జ‌క్క‌న్న టేస్ట్ ని సైతం కొనియాడారు.

ఇంకాస్త గ‌తంలోకి వెళ్తే ఓ సంద‌ర్భంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ ని సైతం అభిమానిస్తాన‌ని చెప్పుకొచ్చిన సంద‌ర్భం ఉంది. అత‌నిలో మెచ్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయ‌ని..టాలీవుడ్ లో మహేష్‌..ఇమేజ్ ..ఫాలోయింగ్ గురించి మెచ్చ‌డం విశేషం. అయితే ఇంట‌ర్వ్యూయ‌ర్ మ‌హేష్ విష‌యాన్ని కూడా రిమెంబ‌ర్ చేసి ఉంటే? ఇద్ద‌రి లో ఎవ‌ర్ని ఎక్కువ‌గా అభిమానించే వారో బ‌య‌ట ప‌డేదని కొంద‌రు అంటున్నారు.

కానీ అదంత వీజీ కాదు. అదే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అయితే ఇద్ద‌రి స్టార్ల‌ని బ్యాలెన్స్ చేసి స‌మాధానం ఇచ్చేవారేమో. అత‌ను ఓ న‌టుడే కాబ‌ట్టి ! మ‌నోభావ‌లు దెబ్బ తినే అవ‌కాశం ఉంటుంద‌ని గ్ర‌హించ‌డానికి ఛాన్స్ ఉంటుంది. మ‌హేష్ పాన్ ఇండియా సినిమా చేయ‌క‌పోయినా ఆయ‌న బ్రాండ్ ఇమేజ్ అదే స్థాయిలో కొన‌సాగుతోంది.

ఇదే విష‌యాన్ని ఇటీవ‌లే మాధ‌వ‌న్ సైతం గుర్తు చేసారు. కానీ మాధ‌వ‌న్ దృష్టిలో సిస‌లైన పాన్ ఇండియాస్టార్ మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని అర్ధ‌మైంది. 'పుష్ప' స‌క్సెస్ని....బాలీవుడ్ లో ఆ సినిమా విజ‌యాన్ని గుర్తు చేసి బ‌న్ని ది బె స్ట్ అనేసారు.