ఆ పార్టీతో కరణ్ క్లియర్ చేయబోతున్నాడా?

Tue May 17 2022 12:48:16 GMT+0530 (IST)

Bollywood Film Maker Karan Johar

బాలీవుడ్ లో వున్న మోస్ట్ క్రేజీ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్. సినిమాతో పాటు ప్రత్యేక టాక్ షోలతో పాపులారిటీని సొంతం చేసుకున్నారీయన. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ అలియాభట్ లతో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న 'బ్రహ్మాస్త్ర'ని నిర్మిస్తున్నారు. 3డీ ఫార్మాట్ లో రూపొందుతున్న ఈ మూవీ మూడు భాగాలుగా విడుదల కాబోతోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో మోషన్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. తెలుగులో ఈ మూవీకి దర్శకధీరుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.దాదాపు ఐదేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 9న హిందీతో పాటు తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లోనూ విడుదల కానుంది. ఇదిలా వుంటే మే 25న కరణ్ జోహార్ తన 50వ పుట్టిన రోజుని జరుపుకోబోతున్నారు. ఇందు కోసం గ్రాండ్ గా పార్టీని కూడా ఏర్పాటు చేస్తున్నారట. బాలీవుడ్ లో లావిష్ పార్టీలకు పెట్టింది పేరుగా నిలిచే కరన్ జోహార్ తన 50 బర్త్ డేని కూడా భారీగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారట. ఇందు కోసం ఓ భారీ పార్టీని ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ పార్టీ కోసం స్పెషల్ గా ఓ భారీ సెట్ నే కరణ్ జోహార్ ప్లాన్ చేసినట్టుగా ముంబై వర్గాలు చెబుతున్నాయి. ఈ పార్టీకి బాలీవుడ్ స్టార్స్ తో పాటు సౌత్ ఇండియాకు చెందిన పలువురు క్రేజీ స్టార్లు కూడా పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది. సౌత్ నుంచి రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ రాకింగ్ స్టార్ యష్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో పాటు చాలా మంది సౌత్ స్టార్స్ పాల్గొనబోతున్నారని తెలిసింది. ఇటీవల సౌత్ ఇండస్ట్రీకి బాలీవుడ్ ఇండస్త్రీకి మధ్య చాలా డిఫరెన్సెస్ వచ్చాయి.

కన్నడ స్టార్ సుదీప్ హిందీ ఇకపై ఎప్పటికీ జాతీయ భాష కాదు అంటూ కామెంట్ చేయడం.. దాని అర్థం తెలుసుకోకుండానే అజయ్ దేవగన్ కౌంటర్ ఎటాక్ కు దిగడం. ఎప్పటికీ హిందీ జాతీయ భాషగానే వుంటుంది. వుండాలి అంటూ కామెంట్ చేయడం. దానికి సుదీప్ కూడా అదే స్థాయిలో కౌంటర్ అటాక్ ఇవ్వడం.. మీ రిప్లై కూడా హిందీలోనే వుంది నాకు అర్థమైంది. అదే నేను కన్నడలో రిస్లై ఇచ్చివుంటే పరిస్థితి ఏంటీ అంటూ కౌంటర్ ఇవ్వడం..

ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ మధ్యలోకి ఎంటర్ కావడం.. బాలీవుడ్ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుంటే సౌత్ సినిమాలు మాత్రం బాలీవుడ్ లో జెండా ఎగరేస్తూ రికార్డులు సృష్టిస్తున్నాయని ఇక బాలీవుడ్ ఓటీటీల కోసమే సినిమాలు చేసుకోవాలంటూ వర్మ ఘాటుగా బాలీవుడ్ పై సెటైర్లు వేయడం.. నన్ను బాలీవుడ్ భరించలేదని మహేష్ బాబు కామెంట్ చేయడం.. దానికి కంగన మద్దతుగా నిలిస్తే ముఖేష్ భట్ కౌంటర్ గా వ్యంగ్య థోరణిలో స్పందించడం..ఈ వివాదంపై ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించడం తో సౌత్ వర్సెస్ నార్త్ గా మారిపోయింది. దీని వల్ల సౌత్ ఇండస్ట్రీస్ .. బాలీవుడ్ ఇండస్ట్రీ మధ్య తీవ్ర స్థాయిలో డిఫరెన్సెస్ కనిపించాయి.

ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ తన 50వ పుట్టిన రోజు వేడుకల్ని జరుపనుకుంటూ సౌత్ స్టార్స్ బాలీవుడ్ స్టార్స్ కు పార్టీ ఇవ్వబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పార్టీ వేదికగా కరణ్ జోహార్ ఇండైరెక్ట్ గా ఓ మెసేజ్ ని పాస్ చేయబోతున్నారట. అదేంటంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఒక్కటే..సౌత్ వేరు బాలీవుడ్ వేరు అనే భావన తప్పు మెసేజ్ ని పాస్ చేసి తాజాగా ఏర్పడిన డిస్టబెన్స్ ని క్లియర్ చేసి అందరిని ఒక్కతాటిపైకి తీసుకురాబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే హాలీవుడ్ ని మించిన సినిమాలు మన దగ్గర పురుడు పోసుకోవడం ఖాయం అని సినీ లవర్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.