బాలీవుడ్ మాఫియాకి ప్రముఖ టాలీవుడ్ నటుడు వత్తాసు!?

Tue Oct 13 2020 23:00:01 GMT+0530 (IST)

Bollywood Drugs Case

బాలీవుడ్ వర్సెస్ డ్రగ్స్ వ్యవహారం పై రిపబ్లిక్ చానెల్ .. టైమ్స్ నవ్ చానెల్ కథనాలు సంచలనం అయిన సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారం సహా నెపోటిజం సవాళ్లు.. నటవారసులకు బలవుతున్న ఔట్ సైడర్ ప్రతిభ అంటూ ప్రత్యేక కథనాలు ఆ రెండు జాతీయ మీడియాలో హైలైట్ అయ్యాయి. దీనిపై బాలీవుడ్ స్టార్లు సహా నిర్మాణ సంస్థలన్నీ గుర్రుమీద ఉన్న సంగతి తెలిసిందే.డ్రగ్స్ సహా పలు ఆరోపణలతో తమ పేర్లను సంస్థల పేర్లను బయటికి లాగి రచ్చకీడ్చారంటూ ఆవేదన వ్యక్తం చేయడమే గాక దీనిపై సీరియస్ గా థింక్ చేసిన ప్రముఖులు సదరు చానెళ్లపై ప్రతిఎటాక్ కి రంగం సిద్ధం చేశారు. సదరు మీడియాలపై దిల్లీ హైకోర్టులో  38 మంది బాలీవుడ్ ప్రముఖులతో కూడిన టీమ్ దిల్లీ హైకోర్టులో పిల్ వేసింది.

దీనిపై బాలీవుడ్ సహాయ నటి స్వరా భాస్కర్ ట్వీట్ చేస్తూ... రిపబ్లిక్ .... టైమ్స్ నౌను అవమానకరమైన వ్యాఖ్యలు చేయకుండా నిరోధించాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో బాలీవుడ్ తిరిగి దావా వేసింది. ఇది అనుచరనీయం అన్న తీరుగా Yaaaaaassssssss !!! అంటూ చప్పట్లు కొడుతున్న ఈమోజీల్ని స్వరా షేర్ చేసారు. దీనికి స్పందించిన ప్రకాష్ రాజ్ .. తాను కూడా చేతులు కలుపుతున్నట్టు చప్పట్ల ఈమోజీల్ని రిప్లయ్ గా షేర్ చేశారు. కంగన బాలీవుడ్ మాఫియాని వ్యతిరేకిస్తుంటే ప్రకాష్ రాజ్ సపోర్టుగా నిలుస్తున్నారా?

పలుమార్లు ప్రకాష్ రాజ్ పై జాతీయ చానెళ్లలో వ్యతిరేక కథనాలు వెలువడ్డాయి. ఆయనపైనా రకరకాల అంశాల్లో రచ్చ చేశాయి కొన్ని చానెళ్లు. అందుకేనా ఈ వ్యతిరేకత అన్న చర్చా మొదలైంది. బాలీవుడ్ లో ప్రకాష్ రాజ్ కూడా ప్రముఖ నటుడు. దీంతో పరిశ్రమకు ఆయన సపోర్టుగా నిలుస్తూ మీడియా చర్యల్ని వ్యతిరేకిస్తున్నారని భావించాల్సి ఉంటుంది. బ్రేకింగ్ అంటూ స్వరా ఆనందం వ్యక్తం చేయడం విలక్షణ నటుడు వకాల్తా పుచ్చుకోవడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.