ఎవెంజర్స్ సిరీస్ రేంజులో YRF యూనివర్శ్ భారీ మల్టీస్టారర్ ప్లాన్!

Sat Dec 05 2020 15:51:35 GMT+0530 (IST)

Bollywood's Big Stars To Unite For YRF Spy Universe Flick

తాజా పరిణామం చూస్తుంటే ఇండియన్ సినిమా మరో లెవల్ ని అందుకునేందుకు తహతహలాడుతున్నట్టే కనిపిస్తోంది. బాహుబలి సిరీస్.. దంగల్ లాంటి చిత్రాల సంచలన విజయాలు సాధించడంతో ఇప్పుడు మేకింగ్ పరంగా మన స్టాండార్డ్స్  హాలీవుడ్ కి ఏమాత్రం తగ్గడం లేదు. 2.0..  సాహో లాంటి భారీ ప్రయోగాలు కూడా ఇందుకు మరింత ఊతాన్ని ఇచ్చాయి.ఇప్పుడు DC యూనివర్శ్ లా YRF సంస్థ భారీ మల్టీస్టారర్స్ కి ప్లాన్ చేస్తుండడం సర్వత్రా ఉత్కంఠ పెంచుతోంది. YRF స్పై యూనివర్శ్ పేరుతో భారీ మల్టీస్టారర్ కోసం సన్నాహకాల్లో ఉందని ఈ మూవీలో షారూఖ్ ఖాన్- సల్మాన్ ఖాన్- హృతిక్ రోషన్ లాంటి స్టార్లను నటింపజేసే ప్రయత్నం చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో కత్రినా కైఫ్- దీపికా పదుకొనే వంటి అగ్ర నాయికలు నటించే వీలుందన్న ఊహాగానాలు సాగుతున్నాయి.

యష్ రాజ్ సంస్థ గట్టి ప్రయత్నాల్లోనే ఉందట. ఇక ఇటీవలే తమ అభిమాన నటుడు షారూక్ చివరకు షూటింగ్ ప్రారంభించడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. గూఢచారి కథాంశంతో భారీ యాక్షన్ చిత్రంగా పఠాన్ తెరకెక్కుతుండగా.. ఈ మూవీ కోసం షారూక్ లాంగ్ హెయిర్ తో షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటిస్తున్నాడని యష్ రాజ్ ఫిల్మ్స్ (వైఆర్ఎఫ్) నుండి మరో గూఢచారి తరహా చిత్రంలో షారూక్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారని కూడా ప్రచారం సాగడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవ్.

యాక్షన్ అవతార్లలో ప్రేక్షకులు సూపర్ స్టార్స్ ఇద్దరినీ కలిసి చూడనున్నారనేది ప్రేక్షకులలోనే కాదు.. పరిశ్రమ పరంగా బిజినెస్ పరంగా కూడా విపరీతమైన ఉత్సుకతను సృష్టించింది.

ఇది ప్రారంభం మాత్రమే. సోర్స్ ప్రకారం.. “ఎవెంజర్స్ సిరీస్ విజయం వెనక లాజిక్ ని వైఆర్ ఎఫ్ పరిశీలించిందట. ఒక సాధారణ లక్ష్యం కోసం జనాదరణ పొందిన పాత్రలు కలిసి రావడం ఎంతగా కలిసొస్తుందో బాక్సాఫీస్ వద్ద రికార్డుల్ని నెలకొల్పుతుందో అవెంజర్స్ ఎండ్ గేమ్ ద్వారా చూశాం. దానికి స్ఫూర్తిగా రోహిత్ శెట్టి కాప్ విశ్వం(యూనివర్శ్) సృష్టించడం ద్వారా ప్రయోగాలు చేశారు. సింబా క్లైమాక్స్ లో సింగ్హామ్ కథనంలో ప్రవేశించినప్పుడు ప్రేక్షకులు తీవ్రస్థాయిలో వెళ్ళిన విధానం ఉత్కంఠ పెంచింది. సూర్యవంశిలో సింఘం - సింబా ఇద్దరూ కనిపించబోతున్నారు. వాస్తవానికి ఇది పరిశీలించదగిన విషయం. ఈ ఫ్రాంచైజీల విజయం సమీప భవిష్యత్తులో ఇదే విధమైన ప్రణాళికను రూపొందించడానికి ఆదిత్య చోప్రాను ప్రేరేపించింది. ప్రస్తుతం.. `పఠాన్` మూవీ చిన్నగా కనిపిస్తుంది. దీనికి విరుద్ధంగా కొత్త సిరీస్ ఉండనుంది. ఇది YRF స్పై విశ్వం గురించి ప్రేక్షకులకు తెలిసేలా చేస్తుంది. ఈ పాత్రలన్నీ ఒకే ప్రపంచానికి చెందినవిగా అలరిస్తాయి” అని విశ్లేషిస్తున్నారు.

మరో సోర్స్ ప్రకారం.. “అన్నీ సరిగ్గా జరిగితే 2023 లో ఆదిత్య చోప్రా వారందరినీ ఒక చిత్రంలో తీసుకువస్తాడు! సల్మాన్ ఖాన్- షారూఖ్ ఖాన్ మాత్రమే కాదు వారి ప్రధాన లేడీ రహస్య ఏజెంట్లుగా కత్రినా కైఫ్ - దీపికా పదుకొనే నటించే వీలుంది. ఇందులో హృతిక్ కూడా ఒక గూఢచారి పాత్ర పోషిస్తాడు.  అతను కూడా ఈ విశ్వంలో ఒక భాగం. అందువల్ల ఈ చిత్రంలో కూడా ఒక భాగం అవుతాడు. ఇది గొప్ప ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపాంతరం చెందుతుంది. ఆదిత్య చోప్రాకు ఇది తెలుసు. ఒకవేళ ఇదే నిజమైతే భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద చిత్రంగా సంచలనాలు సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు ” అని ఒక ప్రముఖుడు విశ్లేషించారు.

వేరొక వాణిజ్య నిపుణుడి ప్రకారం.. “ఈ ఐదుగురు సూపర్ స్టార్లు ఒకే వేదికపై  కలిసి రావాలనే ఆలోచనే గూస్ బంప్స్ ఇస్తుంది! YRF స్పై యూనివర్స్ ఫ్లిక్ ఎప్పుడు ప్రారంభించబడుతుందో ఊహాతీతం. అదే జరిగితే ఆ పోస్టర్ ఎప్పుడు వస్తుంది? ట్రైలర్ ఎప్పుడు ఆవిష్కరిస్తారు? చివరకు సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది? అన్న ఉత్కంఠ ఉంటుంది.  కనిష్టంగా రూ. 100 కోట్ల ఓపెనింగ్ హామీ ఉంటుంది! మనమంతా ఈ చిత్రాన్ని చూడాలని నిజంగా ఆశిస్తున్నాము`` అని వ్యాఖ్యానించారు. అంతిమంగా ఇలాంటి ఓ ప్రయత్నం జరగాలనే ఆశిద్దాం.