Begin typing your search above and press return to search.

ప్రభాస్ పాన్ వ‌ర‌ల్డ్ మూవీ లాంచ్.. గెస్ట్ ఎవ‌రో తెలుసా?

By:  Tupaki Desk   |   24 July 2021 12:45 AM GMT
ప్రభాస్ పాన్ వ‌ర‌ల్డ్ మూవీ లాంచ్.. గెస్ట్ ఎవ‌రో తెలుసా?
X
డార్లింగ్ ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ షూటింగుల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఓ వైపు `రాధేశ్యామ్` చిత్రీక‌ర‌ణ‌ను ముగించి రిలీజ్ పై దృష్టి సారిస్తున్నాడు. మ‌రోవైపు స‌లార్ .. ఆదిపురుష్ 3డి షూటింగుల‌తో బిజీగా ఉన్నాడు. ఈ రెండిటి చిత్రీక‌ర‌ణ సాగుతుండ‌గానే... త‌దుప‌రి నాగ్ అశ్విన్ తో సినిమా ప్రారంభించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నాడు.

తాజా స‌మాచారం మేర‌కు.. ఈ మూవీ నేడు (24 జూలై 2021) లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో డీసెంట్ గా ఎలాంటి హ‌డావుడి లేకుండా ప్రారంభ‌మ‌వుతోందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ మూవీని లాంచ్ చేసేందుకు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హైద‌రాబాద్ కి విచ్చేశారు. ఇక‌ ప్రభాస్.. నాగ్ అశ్విన్ కలయికలో ప్రతిష్టాత్మక తెలుగు చిత్రంలో ఆయ‌న న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం అధికారిక ప్రకటన ఇంత‌కుముందు విడుద‌లైంది. ముహూరత్ వేడుక శనివారం హైదరాబాద్ లో జరుగనుంది.

ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి ఎటువంటి వివరాలు వెల్ల‌డించ‌కుండానే బిగ్ బి ట్వీట్ చేయ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ``టి 3975 - .. ప్రయాణించాను .. శ‌నివారం కొత్త చిత్రం కొత్త ప్రారంభం.. కొత్త వాతావరణం .. కొత్త‌ది ఫేడ‌వుట్ కాదు.. కాస్ట్ లీగా పెరుగుతుంది`` అంటూ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. కొత్త వాతావ‌ర‌ణం అన‌గానే ప్ర‌భాస్ తో మూవీ కోస‌మే ఆయ‌న విచ్చేశార‌నే సంకేతం అందింది. ఈ మూవీని కొద్ది మంది ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ప్రారంభిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. అమితాబ్ బచ్చన్ వారం పాటు హైదరాబాద్ లో షూట్ చేసి ముంబైకి తిరిగి వెళ‌తార‌ని తెలిసింది.

డార్లింగ్ ప్ర‌భాస్ న‌టిస్తున్న నెక్ట్స్ లెవ‌ల్ చిత్ర‌మిది. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజయంతి మూవీస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్టును భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ చిత్రానికి హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ప‌ని చేయ‌నున్నారు. ఈ చిత్రంతో ప్ర‌భాస్ ని పాన్ వ‌రల్డ్ స్టార్ గా ఆవిష్క‌రిస్తాన‌ని నాగ్ అశ్విన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అంటే ఇది బాహుబ‌లిని మించి ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది. సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశంతో ఐ రోబో రేంజులో సూప‌ర్ హీరో ఎలిమెంట్స్ తో ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌భాస్ ని పాన్ ఇండియా స్టార్ డ‌మ్ నుంచి పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ డ‌మ్ కి చేర్చే చిత్రంగా ఇది పాపుల‌రవుతోంది.

పాన్ వ‌ర‌ల్డ్ ఫిక్ష‌న్ ప్ర‌యోగంలో టాప్ స్టార్లు

రోబో - 2.0 త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి అధునాత‌న సాంకేతిక‌త‌తో మ‌రో భారీ పాన్ ఇండియా సినిమాని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం సాగుతుండ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. వ‌ర్చువ‌ల్ ప్ర‌పంచంగా మారుతున్న ప్ర‌స్తుత వ‌ర‌ల్డ్ ని అడ్వాన్స్ డ్ స్టేజ్ లో ఎలా ఉంటుందో ఆయ‌న తెర‌పై ఆవిష్క‌రించ‌నున్నార‌ని లీకులందుతున్నాయి. దీనికోసం భారీ వీఎఫ్ ఎక్స్ సాంకేతిక‌త అవ‌స‌రం. అందుకే హాలీవుడ్ సాంకేతిక నిపుణుల‌ను బ‌రిలో దించుతున్నారు.

వీఎఫ్ ఎక్స్ కోస‌మే బ‌డ్జెట్లో మెజారిటీ భాగం ఖ‌ర్చు చేయ‌నున్నార‌ని తెలిసింది. ఇంత‌కుముందు దాదాపు 250-300 కోట్ల మేర బ‌డ్జెట్ ని ఈ మూవీ కోసం కేటాయించార‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ స్టార్ ప‌వ‌ర్ ప‌రంగా స్పాన్ పెర‌గ‌డంతో 350 కోట్ల వ‌ర‌కూ వెచ్చించేందుకు ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది. ఇందులో స‌గం పైగా పారితోషికాల‌కే ఖ‌ర్చు చేయ‌నున్నార‌న్న గుస‌గుస‌లు తెర‌పైకొచ్చాయి.

బారీ పారితోషికాల‌తో సంచ‌ల‌నాలు:

ఇక ఈ మూవీకి పెట్టే బ‌డ్జెట్ లో 100 కోట్లు కేవ‌లం ప్ర‌భాస్ ఖాతాలోకే ప‌డిపోతుంటే.. మ‌రో 70కోట్లు ఇత‌ర స్టార్ల‌కు ఖ‌ర్చయ్యేందుకు ఆస్కారం ఉంద‌ని స‌మాచారం. దీపిక ప‌దుకొనే.. అమితాబ్ తో పాటు మ‌రో 8 మంది బాలీవుడ్ స్టార్లు ఈ చిత్రంలో న‌టించేందుకు స్కోప్ ఉందిట‌. దీపిక‌కు అమితాబ్ కు చెప్పుకోద‌గ్గ పారితోషికం ముట్ట‌జెప్పాల్సి ఉంటుంది. ఇత‌ర పెద్ద స్టార్ల‌కు భారీ పారితోషికాల్ని చెల్లించాల్సి ఉంది. భవిష్యత్తు కాలం మారుతున్న‌ టెక్నాల‌జీతో అనుసంధానంపైనా.. హై ఎండ్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ డ్రామాతో ఈ సినిమా తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలిసింది.