ఈయన వయసు 56 కాదు 26!

Mon Sep 26 2022 10:31:12 GMT+0530 (India Standard Time)

Bollywood BadShah Superstar Shah Rukh Khan

బాలీవుడ్ బాద్ షా సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ గత పదేళ్లుగా సక్సెస్ లు దక్కించుకోలేక పోయినా కూడా ఇప్పటికి అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ హీరోల జాబితాలో షారుఖ్ ఖాన్ ముందు వరుసలో ఉంటాడు అనడంలో సందేహం లేదు. ఆయన్ను జనాలు ఆ స్థాయిలో అభిమానిస్తారు కనుకే ఆయన తాను చేసే ప్రతి సినిమా కోసం ప్రాణం పెట్టి మరీ సక్సెస్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు.జీరో సినిమా వచ్చి దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఆయన నుండి సినిమా రాకపోవడంతో అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. ఈ గ్యాప్ ను ఫిల్ చేసేందుకు బ్యాక్ టు బ్యాక్ మూడు నాలుగు సినిమాలను షారుఖ్ ఖాన్ విడుదల చేసేందుకు సిద్ధం అయిన విషయం తెల్సిందే. అయితే ఈసారి షారుఖ్ చేసిన.. చేస్తున్న సినిమాలన్నీ కూడా మాస్ మసాలా కమర్షియల్ మూవీస్ అంటూ సమాచారం అందుతోంది.

ప్రయోగాలకు దూరంగా పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో షారుఖ్ ఖాన్ సినిమాలు చేస్తున్నాడు. ఇక ప్రతి సినిమా కోసం తన ఫిజిక్ ను సాధ్యం అయినంత వరకు మార్చుకుంటూ పాత్రను పండించేందుకు షారుఖ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. షారుఖ్ ఇటీవల ఎయిట్ ప్యాక్ బాడీతో కనిపించి అందరిని సర్ ప్రైజ్ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు మరోసారి షారుఖ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.

షారుఖ్ ఖాన్ షేర్ చేసిన ఈ ఫోటో యువ హీరోలు సైతం సిగ్గుతో తల దించుకునేలా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. షారుఖ్ ఖాన్ వయసు 56 ఏళ్లు. అయినా కూడా ఆయన పాతికేళ్ల కుర్రాడి మాదిరిగా ఇప్పటికి కూడా ఎంతో కష్టపడి వర్కౌట్స్ చేస్తూ ఈ స్థాయి బాడీని దించాడు.

ఈ ఫిజిక్ మరియు ఆయన ప్యాక్స్ చూస్తే ఎవరైనా నిజంగానే ఈయన వయసు 56 ఏళ్లు ఉంటుందా లేదంటే 26 ఏళ్ల వయసు కుర్రాడా అన్నట్లుగా ప్రశ్నార్థకంగా చూస్తున్నారు.

షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఇదే సమయంలో మన సౌత్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమాను చేస్తున్నాడు. నయనతార మరియు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించగా సౌత్ సంగీత దర్శకుడు ఆ సినిమాకు వర్క్ చేస్తున్నాడు. కనుక జవాన్ సినిమా కచ్చితంగా సౌత్ లో కుమ్మేస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.