Begin typing your search above and press return to search.

మలైకా ఆంటీని ఇలా ఎప్పుడైనా చూసారా..

By:  Tupaki Desk   |   2 April 2020 3:00 PM GMT
మలైకా ఆంటీని ఇలా ఎప్పుడైనా చూసారా..
X
కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సామాన్యులు నానా ఇబ్బందులు పడుతుంటే సెలబ్రిటీలు మాత్రం తమ రోజువారీ పనులను వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఖాళీగా ఉన్న మన స్టార్ హీరోయిన్లు తమ అభిమానుల కోసం వర్క్‌ అవుట్ వీడియోస్, ఫోటోస్‌ ను తమ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. కత్రినాకైఫ్ అంట్లు తోముతూ, ఇల్లు ఊడుస్తూ ఫోటోలు పోస్ట్ చేయగా, నిధి అగర్వాల్ కేకులు తయారు చేయడంలో బిజీ అయింది. ఇంక మన ఆలియా పాప అయితే శ్రద్ధగా రీడింగ్ మొదలు పెట్టింది. దీపిక పడుకొనే మాత్రం వంట గదిని సర్దుకుంటూ రణవీర్ ఇల్లాలు అనిపించుకుంటున్నది. ఇలా ప్రతీ సెలెబ్రెటీ ఏదో ఒక పని చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా లో వదులుతున్నారు.

ఇప్పుడు తాజాగా 46 ఏళ్ల హాట్ బ్యూటీ మలైకా ఆంటీ లాక్ డౌన్ లో తన సమయాన్ని లడ్డులు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నది. మలైకాని ఇలాంటి గెట్ అప్ లో ఎప్పుడూ చూసి ఉండరు. వయస్సుతో పాటే అందం పెరిగే లక్షణం కలిగిన శరీరం కలవారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్లలో మలైకా అరోరా ఒకరు. నాలుగున్నర ప‌దుల వ‌య‌సైనా కుర్ర హీరోయిన్స్‌తో గ్లామ‌ర్ విష‌యంలో పోటీ ప‌డుతూండటం మలైకా అరోరా స్పెషాలిటీ. అదే గ్లామ‌ర్‌ తో వయసులో ఆమె కంటే చాలా చిన్నవాడైన అర్జున్ క‌పూర్‌ని క‌ట్టిపడేసిందేమో అంటారు ఆమె ఫ్యాన్స్. ఏదేమైనా ఎప్పుడూ అందాల ఆరబోత ప్రోగ్రామ్ పెట్టి కుర్రకారుకు నిద్ర లేకుండా చేసే మలైకా ఆంటీ ఈ లడ్డుల తయారీ వీడియో పోస్టు రసిక హృదయాలను గాయ పరిచిందని చెప్పవచ్చు. ఈ లడ్డుల వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయింది.