అపరిచితులైనా హగ్గులిచ్చిన హాటీ!

Wed Jan 22 2020 22:29:55 GMT+0530 (IST)

Bollywood Actress Richa Chadha Hugs Stranger

హీరోయిన్లు పబ్లిగ్గా అపరిచితులకు కౌగిలింతలివ్వడం ఎప్పుడైనా చూసారా? అసలు అలాంటి ఆలోచన ఏ భామకైనా వస్తుందా?  కానీ ఓ హీరోయిన్ మాత్రం ఆ రోజంతా  హగ్గులివ్వడమే పనిగా పెట్టుకుంది. అంతగా పరిచయం లేని వారికీ హగ్గులిచ్చి ఆప్యాయతను పంచింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా  తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.  జనవరి22  జాతీయ కౌగిలింతల దినోత్సవం. ఈ డేని ఎవరూ పట్టించుకోరు. కనీసం సోషల్ మీడియాలో కూడా దీనిపై ట్వీట్ కరువే. అలాంటింది రిచా ఏకంగా కౌగిలింతల డే పబ్లిసిటీ కోసం నడుం బిగించింది. ప్లెక్సీ పట్టుకుని ఫ్రీగా హగ్గులిస్తానని  ముంబై వీధులన్నీ తిరిగింది. రోడ్డు మీద కనిపించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టలేదు. ఆడ.. మగ..ముసలి ముతక ఇలా కనిపించిన ప్రతీ ఒక్కరిని తన కౌగిలిలో బంధించి కావాల్సినంత ప్రేమను పంచేసింది.

ఈ ప్రపంచంలో ఎంతో ద్వేషం ఉంది. అందుకే ప్రేమతో దాన్ని తగ్గించాలి అనుకున్నా. అపరిచితులను కౌగిలించుకున్నప్పు ఓ మ్యాజిక్ లా అనిపించిందని తెలిపింది. ఇకపై  ప్రతి ఏడాది ఇలాగే చేయాలి అనిపిస్తోంది. వచ్చే ఏడాది మీరు నన్ను కలవవచ్చు. తప్పకుండా హగ్గు ఇస్తాననని తెలిపింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజనులు రిచా కౌగిలింలతపై తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు అపరిచితులు జరంతభద్రం...అందరు మంచి వాళ్లు ఉండరు మేడం! అంటూ సలహాలిచ్చారు.  మొత్తానికి రిచా ఓ మంచి పనికి నడుం బిగించడం మాత్రం గొప్ప విషయమే. ఎవరండీ.. ఈరోజుల్లో కౌగిలించుకుని ప్రేమను పంచేది. ప్రస్తుతం రిచా పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.