షాకింగ్: మరో సినీ నటికి పాజిటివ్

Mon Jul 13 2020 16:20:27 GMT+0530 (IST)

Shocking: Positive for another movie star

సినీ ఇండస్ట్రీని కరోనా కప్పేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో అమితాబ్ కుటుంబానికి అంటుకుంది.ఇతర నటీనటులకు సోకుతోంది. వరుసగా సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సినీ నటి రాచెల్ వైట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.బాలీవుడ్ నటి రాచెల్ వైట్ కు కరోనా సోకింది. జ్వరం దగ్గు లాంటి లక్షణాలు కనిపించడంతో ఆమె కరోనా టెస్ట్ చేయించుకుంది. ఈ పరీక్షలో ఆమెకు పాజిటివ్ గా తేలింది.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది. ప్రస్తుతం ఈ బాలీవుడ్ నటి కోల్ కతాలోని తన నివాసంలో హోం క్వారంటైన్ లో ఉంటోంది. తన ఆరోగ్యం మెరుగుపడాలని అభిమానులు ప్రార్థన చేయాలని కోరింది.నెటిజన్లు ఆమెకు మద్దతుగా దైర్యం చెబుతున్నారు.