టాప్ స్టోరి: పద్ధతిగా కనిపిస్తేనే వెనకబాటుతనం!

Wed Jun 29 2022 08:00:01 GMT+0530 (IST)

Bollywood Actress In Bikini

బికినీ అంటే ఒకప్పుడు చాలా అరుదుగా ధరించేది. ఐటమ్ భామలు స్విమ్మింగ్ పూల్ యాక్ట్ లో అరనిమిషం పాటు స్మిమ్ సూట్ లో కనిపించేందుకైనా మొహమాటపడేవారు. సిల్క్ స్మిత.. జ్యోతి లక్ష్మి.. జయమాలిని రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు అంతా అల్ట్రా మోడ్రన్ ట్రెండ్. సీనియర్లు జూనియర్లు కొత్తతరం అనే తేడా ఏం లేదు. బికినీ ధరించాలని దర్శకుడు కోరాలే కానీ దానికి ఏమాత్రం మొహమాటపడని జనరేషన్ ఇది. డెబ్యూ సినిమాల్లోనే బికినీలు ధరించి నవతరం భామలు దుమారం రేపుతున్నారు. నేటితరం భామలు పద్ధతిగా కనిపించడాన్ని వెనకబాటు తనంగా భావిస్తున్నారు!బాలీవుడ్ టు టాలీవుడ్ ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఈ జనరేషన్ కథానాయికల్లో ఫిట్ నెస్ పై శ్రద్ధ కూడా ఒక రేంజులో ఉంది.  భామలంతా కఠినమైన వ్యాయామ సెషన్ లతో ఫిట్ నెస్ గోల్స్ సెట్ చేయడంలో ఎప్పుడూ విఫలం కావడం లేదు. తాము కోరుకునే పర్ఫెక్ట్ బికినీ బాడీలతో మురిపిస్తున్నారు. చిట్టి పొట్టి బికినీలు ధరించి వేడి పెంచేందుకు నిత్యం శ్రద్ధను కనబరుస్తున్నారు.

ఇక ఈ జోన్ లో కొందరు స్పెషలిస్టులు ఉన్నారు. వీళ్లలో ఇటీవల అందాల నాయిక మృణాల్ ఠాకూర్ ముందు వరుసలో నిలుస్తోంది. ఈ భామ చిట్టి పొట్టి బికినీలతో చెలరేగిపోతోంది. ఈషా గుప్తా- దిశా పటానీ- ప్రియాంక చోప్రా- జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి  సీనియర్ భామలు సెక్సప్పీల్  విషయంలో ఎప్పుడూ మొహమాటపడరు. యువతరంలో జాన్వీ కపూర్ ఇటీవల టూమచ్ బికినీలతో రెచ్చగొడుతోంది. అనన్యపాండే సైతం బికినీ గేమ్ లో టాపర్ గా నిలుస్తోంది. ఇక సారా అలీఖాన్- కియరా లాంటి భామలు హద్దు మీరకుండా బికినీ లుక్  లో కనిపించేందుకు ఆసక్తిగా ఉంటారు.

హద్దులు చెరిపేసి చిట్టి పొట్టి బికినీలతో చెలరేగే బ్యూటీస్ లో మృణాల్ ఠాకూర్ పేరు టాప్ వన్ పొజిషన్ లో ఉంది. మృణాల్ ఠాకూర్ ఇటీవలే అత్యంత పొట్టి పింక్ బికినీ ధరించి మిర్రర్ సెల్ఫీని షేర్ చేయడంతో ఇంటర్నెట్ లో మంటలు చెలరేగాయి. పింక్ బికినీ క్షణాల్లో  వైరల్ అయ్యింది.

ఈషా గుప్తా బికినీ లుక్ కి అత్యంత ప్రాధాన్యతనిచ్చే నటి కం మోడల్. ఇటీవల రెడ్ హాట్ బికినీలో ఈ బ్యూటీ ఇచ్చిన ఫోజులు మెంటలెక్కించాయి. మీకు నచ్చినట్టు సుఖంగా ఉండటానికి ఎందుకంత మొహమాటం? అంటూ ఇషాజీ ప్రశ్నిస్తుంటారు. బికినీల విషయానికి వస్తే ఈ సీనియర్ బ్యూటీ ఎప్పుడూ నిరాశపరచదు.

సీకే బ్యూటీగా దిశా పటానీ సంచలనాల గురించి పొట్టి బికినీల హిస్టరీ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలీవుడ్ లోనే హాటెస్ట్ బికినీ బాడీ ఎవరికి ఉంది? అంటే కచ్ఛితంగా దిశా పటానీ పేరునే సూచిస్తారు యువతరం. నిరంతరం గుబులు రేపే బికినీ ఫోటోలతో మంటలు పెట్టడంలో దిశా పటానీ తర్వాతే.

గ్లోబల్ ఐకన్ గా పాపులరై అటు ఆంగ్ల బుల్లితెరను ఏల్తున్న ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ ని పెళ్లాడాక మరింతగా చెలరేగిపోతోంది. నిరంతరం ఈ బ్యూటీ పొట్టి బికినీలు.. పూల్ సైడ్ స్విమ్ సూట్లతో మంటలు పెడుతోంది. ప్రియాంక చోప్రా తరచుగా షేర్ చేసే బికినీ లుక్ కి నేటితరం అమ్మాయిలు ఎంతో అసూయ చెందుతారంటే అతిశయోక్తి కాదు. పీసీ ఎలాంటి లుక్ లో కనిపించినా కానీ తన హబ్బీ నిక్ జోనాస్ అడ్డు చెప్పరు.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బికినీ స్పెషలిస్టుగా పాపులరైంది. ఒంటిపై నూలుపోగైనా లేకుండా కనిపించమంటే చెలరేగిపోయే బ్యూటీగా ఈ శ్రీలంకన్ భామ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇంతకుముందు సాహో లో బ్యాడ్ బోయ్ అంటూ ఐదు నిమిషాల పాటలో ముచ్చెమటలు పట్టించిన సంగతి తెలిసిందే. చిట్టి పొట్టి బికినీలు ధరించి నిరంతరం సోషల్ మీడియాల్లో అగ్గి రాజేస్తూనే ఉంది జాకీ.

కియారా అద్వానీ- జాన్వీ కపూర్- అనన్య పాండే లాంటి నేటితరం నాయికలు బీచ్ బేబ్స్ గా ఇప్పటికే బోలెడంత పాపులారిటీ సంపాదించారు. అది మాల్దీవులు అయినా గోవా అయినా బీచ్ సెలబ్రేషన్ తో మెంటలెక్కించేందుకు పోటీపడతారు. ఇప్పటికే ఈ భామల బికినీ ఫోటోలు అంతర్జాలంలో అగ్గి రాజేసాయి. పొట్టి బికినీలు ధరించడంలో స్పెషలిస్టులుగా వీరంతా పాపులరయ్యారు.

మలైకా అరోరా ఖాన్-అనుష్క శర్మ లాంటి సీనియర్లు పొట్టి బికినీలకు ఎప్పుడూ మొహమాట పడలేదు.  ప్రస్తుతం ప్రియుడు అర్జున్ కపూర్ తో  విదేశీ విహారంలో ఉన్న మలైకా బికినీలతో చెలరేగుతోంది. అలాగే అనుష్క శర్మ తన హాట్ నెస్ విషయంలో ఎప్పుడూ తగ్గదు. ఇంతకుముందే ఓ బిడ్డకు జన్మనిచ్చి మమ్మీ అయినా కానీ గ్లామరస్ యాక్ట్ విషయంలో తగ్గేదే లేదు! అంటూ కెమెరాలకు ఫోజులిస్తోంది.

పూనమ్ పాండే డీగ్రేడ్ నటీమణిగా ఇప్పటికే యువతరానికి సుపరిచితం.  ఈ భామ శృంగార చిత్రాల్లో నటిస్తూ.. సెమీ న్యూడ్ వీడియోలతో చెలరేగిపోవడం తెలిసిందే. తన వంపు సొంపులను మొహమాటం లేకుండా చూపించడానికి పూనమ్ ఎప్పుడూ వెనుకాడదు. షెర్లిన్ చోప్రా ఇదే కేటగిరీలో చెలరేగిపోవడానికి మొహమాట పడదు. షెర్లిన్ చోప్రా కేవలం బికినీలు ధరించడంలో స్పెషలిస్టుగా పాపులరైంది.

హైదరాబాద్ కి చెందిన ఈ బ్యూటీ ముంబై పరిశ్రమలో స్థిరపడేందుకు చాలా పాట్లు పడింది. చివరికి అవకాశాల్లేక ఇటీవల సెమీ న్యూడ్ ఫోటోషూట్లు వీడియో షూట్లతో ఆదాయ మార్గాలను అన్వేషించడంపై బోలెడంత చర్చ సాగుతూనే ఉంది. ముఖ్యంగా రాజ్ కుంద్రా నీలిచిత్రాల యాప్ ల నిర్వహణ వ్యవహారంలో షెర్లిన్ తో గొడవల గురించి తెలిసినదే. రంగుల ప్రపంచంలో పద్ధతిగా కనిపిస్తే వెనకబాటుతనం! అందుకే తమకంటూ ఒక రూట్ ఉందని నిరూపించేందుకు ఈ భామలంతా నిరంతరం తహతహలాడుతుంటారు.