భర్త కాళ్లు పట్టుకున్న విషయాన్ని షో లో చెప్పిన జెనీలియా

Tue Aug 03 2021 22:00:01 GMT+0530 (IST)

Genelia comments are currently going viral

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు జెనీలియా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన నటనతో అభినయంతో ఎందరో అభిమానులను ఈ అమ్మడు సంపాదించుకుంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే బాలీవుడ్ నటుడు మహారాష్ర్ట మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ కొడుకు రితేష్ దేవ్ ముఖ్ తో పెళ్లి కావడం గమనార్హం. ఇలా పెళ్లి తర్వాత జెనీలియా సినిమాలలో కనిపించడం పూర్తిగా తగ్గించేశారు. కొన్ని టీవీ షోలలో తన భర్త బాలీవుడ్ హీరో రితేష్ తో కలిసి సందడి చేస్తున్నారు.జెనీలియా టాలీవుడ్ లో అనేక హిట్ సినిమాలు చేసింది. బొమ్మరిల్లు చిత్రంలో జెనీలియా చేసిన అల్లరిని టాలీవుడ్ ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు. ఎక్కడైనా బయట కూడా అల్లరి చేసే అమ్మాయిలు కనిపిస్తే హాసిని అని పిలుస్తూ ఉంటారు. అంతలా తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఈ అమ్మడు మెస్మరైజ్ చేసింది. ఇలా తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ పెళ్లి తర్వాత సినిమాల్లో కనిపించడం మానేసింది. అంతలా తన నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది పెళ్లి చేసుకున్నాక ఇండస్ర్టీ ముఖం కూడా చూడట్లేదు. కాగా ఈ అమ్మడు 2003వ సంవత్సరంలోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

అక్కడ కూడా అనేక సినిమాలలో నటించింది. కాగా జెనీలియా తన భర్త రితేష్ తో కూడా పెళ్లికి ముందు బాలీవుడ్ లో తుజే మేరీ కసమ్ లాంటి పలు హిట్ చిత్రాలలో నటించింది. 2012 వ సంవత్సరంలో నే పెద్దలు ఒప్పుకోవడంతో రితేష్ దేశ్ ముఖ్ జెనీలియా ఒక్కటయ్యారు. కాగా వీరికి ఇద్దరు సంతానం జన్మించారు. ఈ దంపతుల మొదటి కొడుకు 2014లో రెండో కొడుకు 2016లో జన్మించాడు. కాగా ఈ బ్యూటీ ఈ ఏడాది ఆగస్టులో కరోనా బారిన పడినట్లు ప్రకటించి... అభిమానులకు షాక్ ఇచ్చింది. పెళ్లయిన తర్వాత జెనీలియా సినిమాలను తగ్గించేసింది కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తన భర్త రితేష్ దేశ్ ముఖ్ తో కలిసి సరదాగా సందడి చేస్తూ ఉంటుంది. ఈ ఇరువురు భార్యా భర్తలు చేసే అల్లరి పనులు మామూలుగా ఉండవని చాలా మంది అభిమానులు చెబుతారు. ఇటీవలే ఈ జంట ఓ డాన్స్ రియాల్టీ షాదీ షోకు జడ్జిలుగా వ్యవహరించారు. ఈ డ్యాన్స్ షో లో పోటీదారులు చేసిన స్కిట్లు చూశాక... జెనీలియా మాట్లాడుతూ.. ఇదంతా చూసిన తర్వాత తమ పెళ్లి రోజు గుర్తుకు వచ్చిందని చెప్పారు. ఆనాటి మధుర స్మృతులను గుర్తు కు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. తన భర్త రితేష్ దేశ్ ముఖ్ తన పెళ్లి రోజున తన పాదాలను ఎనిమిది సార్లు పట్టుకున్నాడని నవ్వుతూ చెప్పింది. దీనికి వెంటనే రితేష్ స్పందిస్తూ... పెళ్లి తర్వాత ఏం చేయాలనేది అక్కడున్న పంతులుకు అనుభవం కావచ్చు అని అన్నాడు.

రితేష్ దేశ్ ముఖ్ ఇలా చెప్పడంతో ఒక్కసారిగా షోలో నవ్వులు పూశాయి. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు వధువు కాళ్లు పట్టుకోవడం కామన్ గా జరుగుతుంది. అదే తంతు రితేష్ మరియు జెనీలియా పెళ్లిలో కూడా జరిగిందట. ఇప్పుడు అదే విషయాన్ని టీవీ షో లో జెనీలియా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జెనీలియా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జెనీలియా ఈ విషయం చెప్పిన సమయంలో రితేష్ మొహం కాస్త మాడినట్లు అయ్యిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.