నటవారసురాలితో కుర్ర హీరో డేటింగ్?

Thu May 26 2022 05:00:01 GMT+0530 (IST)

Bollywood Actress Dating with Young Hero

బాలీవుడ్ లో నటవారసురాలిగా అడుగుపెట్టిన యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సారా ఇంతకుముందు హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో డేటింగ్ చేసినట్టు అంగీకరించింది. అనంతరం దివంగతుడైన సుశాంత్ జీవితంలో ట్విస్టుల గురించి తెలిసిందే. ఇకపోతే సారా అలీఖాన్ మరో యువహీరో కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ చేస్తోందంటూ కథనాలు వైరల్ అయ్యాయి.అయితే సారాతో డేటింగ్ పై కార్తీక్ క్లారిటీనిచ్చారు. కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్ నటితో డేటింగ్ చేస్తున్నాడని నర్మగర్భంగా అంగీకరించాడు అతను సారా అలీ ఖాన్ వైపు  వేళ్లు చూపిస్తున్నాడా? అన్నది సందిగ్ధంగా మారింది. కార్తిక్ ఆర్యన్ ఇటీవల విడుదలైన హారర్-కామెడీ చిత్రం భూల్ భూలయ్యా 2 విజయంతో రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్తున్నాడు.

ఇటీవలి ఇంటర్వ్యూలో కార్తీక్ తాను గతంలో బాలీవుడ్ యువనాయిక సారాతో డేటింగ్ చేసినట్లు వెల్లడించాడు. సారా అలీ ఖాన్ తో గుసగుసలపై స్పందిస్తూ.. ఇది నిజమే అనేలా హింట్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజా మీడియా ఇంటరాక్షన్ లో.. కార్తీక్ ఆర్యన్ కి డేటింగ్ పై ప్రశ్న ఎదురైంది. గతంలో ఒక బాలీవుడ్ నటితో డేటింగ్ చేశానంటూ దీనిపై అతడు ఛమత్కరించారు. ప్రశ్నకు జవాబుగా వెంటనే ''అవును'' అని సమాధానం ఇచ్చాడు. ఇది సారా అలీ ఖాన్ తో అతని డేటింగ్ పుకార్లను ఖరారు చేస్తోంది.

కార్తీక్ ఆర్యన్ - సారా అలీ ఖాన్ జంట 'లవ్ ఆజ్ కల్' సినిమా షూటింగ్ సమయంలో డేటింగ్ చేస్తున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. కాఫీ విత్ కరణ్ లో సారా గురించి ప్రస్థావిస్తూ కార్తీక్ తను ఎంతో క్యూట్ గా కనిపిస్తుందని ఒప్పుకున్నాడు. ఇది చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఏది ఏమైనప్పటికీ ఈ గాసిప్స్ అనంతరం ఈ జంట వెంటనే విడిపోయారు . ఒక అగ్లీ బ్రేకప్ అయ్యిందని గొడవలయ్యాయని పుకార్లు వచ్చాయి. దీని కారణంగా ఇన్ స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసారు. ఇది కూడా వారి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇటీవల కార్తిక్ - సారా ఒక అవార్డ్ షోలో తిరిగి కలుసుకున్నప్పుడు ఒకరితో ఒకరు స్నేహపూర్వకంగా మాట్లాడుకోవడంతో అభిమానులు చాలా సంతోషించారు.

కరణ్ తో విభేధించి మరీ హిట్టు కొట్టాడు

కార్తీక్ ఆర్యన్ నటించిన 'భూల్ భూలయ్యా 2' ఇప్పటికే రూ.54.50 కోట్లు రాబట్టింది. కార్తీక్ ఆర్యన్ - కియారా అద్వానీల భూల్ భూలయ్యా 2.. కంగన ధాకడ్ తో పాటు శుక్రవారం విడుదలైంది. మొదటి వారాంతంలో ఊహించిన దాని కంటే మెరుగైన ప్రదర్శనను అందుకుంది. విడుదలకు ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ.3.50 కోట్లు రాబట్టింది. ఇప్పుడు మూడు రోజుల తర్వాత ఈ సినిమా మొత్తం వసూళ్లు 54.50 కోట్లకు చేరాయి. శుక్రవారం తొలిరోజు ఈ సినిమా రూ.13.50 కోట్ల వసూళ్లను సాధించింది.

శనివారం ఈ చిత్రం వసూళ్లు  18 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఇప్పుడు ఆదివారం ఏకంగా 23 కోట్ల రూపాయలను వసూళ్లతో మూడు రోజులకు 50కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. ఈ సినిమా లైఫ్ టైమ్ 100 కోట్ల క్లబ్ లో చేరుతుందని అంచనా. ఓవైపు కరణ్ జోహార్ తో విభేధించి దోస్తానా 2 నుంచి వైదొలగిన కార్తీక్ ఆర్యన్ కి ఇది పెద్ద ఊరట. కరణ్ కి వ్యతిరేకంగా అతడికి కంగన మద్ధతు కూడా లభించింది.