స్టార్ హీరో మొదటి పెళ్లి వింత కహానీ

Sun Jun 26 2022 20:00:01 GMT+0530 (IST)

Bollywood Actor Ranbir Kapoor

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వరుసగా సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు. ప్రతిష్టాత్మక మూవీ బ్రహ్మాస్త్ర పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి. ఆ సినిమా కంటే ముందు షంషేర తో రణబీర్ కపూర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా సినిమా ప్రమోషన్ లో భాగంగా రణబీర్ కపూర్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ను పెళ్లి చేసుకున్న రణబీర్ కపూర్ తమ వైవాహిక జీవితం గురించి.. ఆలియా తో తన బంధం గురించి చెప్పుకొచ్చాడు. అదే సమయంలో తనకు గతంలో ఒక పెళ్లి అయ్యింది.. ఆలియా తనకు రెండవ పెళ్లి అంటూ బాంబు పేల్చాడు. అయితే తన మొదటి భార్య ఎవరు అనే విషయం తెలియదు.. ఆమెను ఎప్పుడు చూడలేదు అన్నాడు.

కొన్ని సంవత్సరాల క్రితం తన ఇంటి వద్దకు ఒక అమ్మాయి వచ్చి గేటు ముందు రణబీర్ అంటే నాకు చాలా ఇష్టం... అతడితోనే నా జీవితం అంటూ మా ఇంటి యొక్క గేటు మరియు గోడలను నన్ను గా భావించి అక్కడే పెళ్లి చేసుకున్నట్లుగా ఆ అమ్మాయి భావించి అక్కడ నుండి వెళ్లి పోయిందట. ఆ విషయాన్ని నాకు మా సెక్యూరిటీ వ్యక్తి చేప్పినప్పుడు ఆశ్చర్యం కలిగింది.

ఆమె నన్ను భర్తగా భావిస్తున్నాను అంటూ అక్కడ నుండి వెళ్లి పోయిందట. ఆ తర్వాత ఆమెను చూడలేదు.. అప్పటి నుండి ఆమెను మళ్లీ కలిసిందే లేదు అంటూ చాలా సంవత్సరాల క్రితం విషయాన్ని రణబీర్ కపూర్ చెప్పుకొచ్చాడు. అందుకే ఆమె నాకు మొదటి భార్య అవుతుంది.. ఆలియా రెండవ భార్య అవుతుందని సరదాగా వ్యాఖ్యలు చేశాడు.

ఆ విషయాన్ని ఆలియా తో కూడా అప్పుడప్పుడు సరదాగా అంటూ ఉంటాను అన్నాడు. ఇక ఆలియా మరియు రణబీర్ ల జోడీ చాలా రొమాంటిక్.. ఇద్దరు చూడముచ్చటగా ఉంటారు అంటూ అభిమానులు అంటూ ఉంటారు. ఇక రొమాంటిక్ హీరో ఇమేజ్ ను వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా రణబీర్ కపూర్ మరో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.