తన కంటే 37 ఏళ్ల పెద్దాయనతో అమ్మడి ఎఫైర్

Tue Feb 25 2020 12:15:57 GMT+0530 (IST)

Bold Pictures Of Bigg Boss Fame Jasleen

ఏజ్ గ్యాప్ తో పని లేకుండా.. ఎక్కువ వయసు ఉన్న వారితో లవ్వు అంటే అదో హాట్ టాపిక్. ఇలాంటివి కొత్తేమీ కాదు కానీ... ఇది మరీ విచిత్రం. తనకంటే దాదాపు 37 ఏళ్లు పెద్ద వాడైన ఆయనంటే ఆ హాట్ గాళ్ కి విపరీతమైన లవ్వు. అతడితో రొమాన్స్ అదరగొట్టేస్తూ యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరీ భామ? లేటు వయసు సుందరాంగుడెవరు? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.ప్రఖ్యాత గాయకుడు అనూప్ జలోటా.. ఆయన ప్రియురాలు జస్లీన్ గురించే ఇదంతా. ఆయన ఏజ్ ఆమె కంటే 37ఏళ్లు ఎక్కువ. అయినా ఎంతో అన్యోన్యంగా కలిసి పోతారు. ఒకరి పై ఒకరు పబ్లిక్ వేదికలపైనే ముద్దులు కురిపించేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. హిందీ బిగ్ బాస్ షో వీక్షించే వాళ్లకు ఈ జంట రొమాన్స్ వీక్షించడం కొత్తేమీ కాదు. బిగ్ బాస్ వేదిక పై ఫేమస్ కావడం తో ఇప్పుడు బయటా వీళ్లు హాట్ టాపిక్ గా మారిపోయారు. అనుప్- జస్లీన్ జంట త్వరలో వివాహం చేసుకోబోతున్నారట.

ఇక బిగ్ బాస్ లేటెస్ట్ షోతో పాపులరైన జస్లీన్ సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్. అక్కడ ఈ అమ్మడి వేడెక్కించే ఫోటోషూట్లు యూత్ కి మత్తెక్కిస్తున్నాయి. స్విమ్ సూట్.. బికినీ.. టూపీస్ కాదేదీ ఆరబోతకు అనర్హం! అన్న చందంగా ఈ అమ్మడు నిరంతరం షేర్ చేసే ఫోటోలు యూత్ లో ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. మత్తెక్కించే అందం చందం.. అదిరి పోయే శరీరాకృతి తో జస్లీన్ టెంప్టింగ్ లుక్ కి ప్రత్యేకించి ఫ్యాన్స్ ఉన్నారు. అంత పెద్దాయన స్పెల్ బౌండ్ అయిపోయాడంటేనే అర్థం చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక గాయకుడు అయిన అనుప్ జలోటా.. జస్లీన్ కి గురువు. టీచర్ తోనే ప్రేమ లో పడి అటుపై పెళ్లికి రెడీ అవుతుండడం ఈ జంట ప్రేమకథ ప్రత్యేకత.

జస్లీన్ నేపథ్యం పరిశీలిస్తే తన పూర్తి పేరు జస్లీన్ మథారు. 11 వయసుకే క్లాసికల్ తో పాటు వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకునేందుకు గురువును వెతుక్కుంది. ఇంటర్ చదివేప్పుడు(16 ప్రాయంలో) కాలేజ్ కాంపిటీషన్ లో బెస్ట్ ఫిమెల్ సింగర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత గాయనిగా కెరీర్ ని సాగిస్తూ అభిమానుల్ని సంపాదించుకుంది. లవ్ డే అనే ఆల్బమ్ లోనూ గాయనిగా మెప్పించింది. మికా సింగ్- సుఖ్వీందర్ సింగ్- అంజాద్ ఖాన్ వంటి టాప్ సెలబ్స్ తో లైవ్ కార్యక్రమాల్లోనూ పాపులరైంది. `ద డర్టీ రిలేషన్` మూవీతో సినీ అరంగేట్రం చేసింది. ప్రస్తుతం నటన పైనా సీరియస్ గా దృష్టి సారిస్తోంది.