బన్ని చరణ్ కోసం ఊర్వశిని బ్లాక్ చేస్తున్నారా?

Sun Sep 27 2020 19:02:45 GMT+0530 (IST)

Blocking Urvashi for Bunny Charan?

బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా వేడెక్కించే స్టింట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. అందానికి అందం నటన ఎక్స్ ప్రెషన్ ఇలా అన్ని కోణాల్లోనూ ఊర్వశి ది బెస్ట్ అని గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు నటించిన హేట్ స్టోరి 4 సంచలనమే అయ్యింది.తాజా సమాచారం ప్రకారం.. ఊర్వశి సౌత్ వైపు చూస్తోంది. ఇక్కడ పెద్ద రేంజ్ కెరీర్ ని ఆశిస్తోందని తెలుస్తోంది. ఆ క్రమంలోనే బన్ని చరణ్ లాంటి స్టార్లు ఈ భామను ఎంపిక చేయనున్నారని ఇంతకుముందు కథనాలొచ్చాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ లో ఓ స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశిని ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. ఆ మేరకు బన్నితో నటించనున్నా అంటూ ఊర్వశి స్వయంగా వెల్లడించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. డాన్సుల్లో నాకు స్ఫూర్తి నిచ్చిన స్టార్ అల్లు అర్జున్. తనతో పుష్పలో నా సౌతిండియన్ డాన్స్ స్టైల్ ని మీకు చూపించబోతున్నాను`` అంటూ ఊర్వశి రౌతేలా డాన్స్ కి సంబధించిన వీడియోను పోస్ట్ చేసింది. ఇక ఈ మూవీకి దేవీశ్రీ అదిరిపోయే మాస్ బీట్స్ అందించనున్నారట. ఇదిలా ఉండగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఊర్వశి రౌతేలా పేరును తాము చేయనున్న ఏదో ఒక ప్రాజెక్టుకి పరిశీలించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ బ్యాక్ టు బ్యాక్ ఊర్వశి మెగా కాంపౌండ్ లో లాకైపోతే అమ్మడికి జాక్ పాట్ తగిలినట్టే.