Begin typing your search above and press return to search.

బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ 'బింబిసార‌' ఓటీటీలోకి వ‌చ్చేది అప్పుడేనా?

By:  Tupaki Desk   |   27 Sep 2022 11:33 AM GMT
బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ బింబిసార‌ ఓటీటీలోకి వ‌చ్చేది అప్పుడేనా?
X
'పటాస్' మూవీ తర్వాత సరైన హిట్ లేక సతమతం అవుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్ గా 'బింబిసార‌' అనే మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రంతో శ్రీ వ‌శిష్ట్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇందులో కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.

హిస్టారిక‌ల్ ఫాంటసీ కథాంశానికి టైం ట్రావెల్ కాన్సెప్ట్ ను ముడిపెట్టి ఓ అద్భుతమైన విజువల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో కళ్యాణ్ రామ్ బింబిసారుడుగా, దేవదత్తుడుగా రెండు విభిన్న పాత్రల‌ను పోషించాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం.. తొలి ఆట నుంచే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. క‌థా నేప‌థ్యం, క‌ళ్యాణ్ రామ్ న‌ట‌న‌, యాక్ష‌న్ స‌న్నివేశాలు, సంగీతం సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణలుగా నిలిచాయి.

టాక్ అనుకూలంగా ఉండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎక్సలెంట్ కలెక్షన్స్‌ తో బీభత్సం సృష్టించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 15.6 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 16.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఊహించిన దానికంటే బెటర్ కలెక్షన్స్ తో ఇటు నిర్మాత‌ల‌కు, అటు బ‌య్య‌ర్ల‌కు డబుల్ ప్రాఫిట్స్‌ను అందించింది.

అలాగే క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్య‌ధిక వ‌సూళ్లను రాబ‌ట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అయితే ఈ సినిమా విడుద‌లై రెండు నెల‌లు కావస్తున్నా ఓటీటీ రిలీజ్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ బ‌య‌ట‌కు రాలేదు. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన‌ బింబిసారను ఓటీటీలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు ప్రారంభం అయ్యాయ‌ట‌.

ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5 'బింబిసార‌' డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను భారీ ధ‌ర‌కు సొంతం చేసుకుంది. అయితే థియేట్రిక‌ల్ ర‌న్ పూర్తి కావ‌డంతో.. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు జీ5 వారు డేట్ లాక్ చేశార‌ట‌. అక్టోబర్ 7 నుంచి ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంద‌ని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

కాగా, 'బింబిసార' విజయవంతం అయిన నేపథ్యంలో రెండో భాగం కూడా ఉంటుందని ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్రకటించారు. ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ వ‌శిష్ట్ బింబిసార 2 స్క్రిప్ట్ వ‌ర్క్ పై క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. మ‌రోవైపు బింబిసార 2 మూవీ ఎలాంటి కథతో వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.