Begin typing your search above and press return to search.

స్టార్ హీరో వెంట‌ప‌డ్డారు.. ఇప్ప‌డు బ్లేమ్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   19 Aug 2022 9:30 AM GMT
స్టార్ హీరో వెంట‌ప‌డ్డారు.. ఇప్ప‌డు బ్లేమ్ చేస్తున్నారా?
X
స్టార్ హీరో తో సినిమా అన‌గానే ప్రొడ్యూస‌ర్లు ఆ హీరో క్రేజ్ వ‌ల్ల వ‌చ్చే లాభాల్ని లెక్క‌లు వేసుకుంటుంటారు. త‌న‌తో సినిమా చేస్తే ఎన్ని కోట్లు లాభాలు పొందొచ్చు సినిమాని ఎన్ని కోట్ల‌లో తీస్తే ఎన్ని కోట్లు రిట‌ర్న్ వ‌స్తాయి?.. ప్రాఫిట్ ఎంతొస్తుంది? వంటి లెక్క‌ల ఆధారంగానే స్టార్ హీరోల‌తో క‌థ‌లు చెప్ప‌కుండానే కాంబినేష‌న్ లు సెట్ చేసుకుంటూ భారీ సినిమాల‌కు ప్లాన్ లు చేస్తూ వ‌స్తున్నారు. గ‌త కొన్నేళ్లుగా టాలీవుడ్ లో బాలీవుడ్ లో ఇదే జ‌రుగుతూ వ‌స్తోంది.

వ‌చ్చింది కూడా. అయితే క‌రోనాకు ముందు ఇదే త‌ర‌హాలో ఓ స్టార్ హీరో త‌న‌కు ఆస‌క్తిలేద‌ని తిర‌స్క‌రించినా స్టార్ ప్రొడ్యూస‌ర్‌, స్టార్ డైరెక్ట‌ర్ ఇది మీరు చేస్తేనే బాగుంటుంద‌ని చెప్పి మ‌రీ బ‌ల‌వంతంగానే స‌ద‌రు స్టార్ హీరోతో ఓకే అనిపించుకున్నార‌ట‌.

సినిమా ప‌ట్టాలెక్కడానికి ముందు కూడా స‌ద‌రు స్టార్ హీరో ఈ త‌ర‌హా సినిమా తాను చేయ‌లేన‌ని చెప్పినా కూడా స‌ద‌రు హీరోని వెంట‌ప‌డి మొహ‌మాట పెట్టి మ‌రీ ఒప్పించార‌ట‌.

అప్ప‌టి నుంచి ఈ మూవీ షూటింగ్ న‌త్త‌ న‌డ‌క‌న‌ సాగుతూ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతూ వ‌స్తోంది. స‌ద‌రు హీరో కార‌ణంగానే ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింద‌ని, ఆగుతూ సాగుతోంద‌ని, త‌న కార‌ణంగా స్టార్ ప్రొడ్యూస‌ర్‌, డైరెక్ట‌ర్ తీవ్రంగా ఇబ్బంది ప‌డుతూ ముందుకు వెళ్ల‌లేక వెన‌క్కి పోలేక న‌లిగిపోతున్నార‌ని ప్ర‌చారం మొద‌లైంది. స్టార్ హీరో క‌న్ఫ్యూజ‌న్ వ‌ల్లే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ల‌డం లేద‌నే కామెంట్ లు ఈ మ‌ధ్య ఎక్కువ‌య్యాయి.

ఇదిలా వుంటే గిల్డ్ బంద్ కార‌ణంగా షూటింగ్ లు బంద్ కావ‌డంతో త్వ‌ర‌లోనే ఈ మూవీ షూటింగ్ ని తిరిగి ప్రారంభించ‌బోతున్నారు. మ‌రో ఆరు రోజుల్లో అంటే ఆగ‌స్టు 24 నుంచి షూటింగ్ ల‌ని కొంత మంది స్టార్ ప్రొడ్యూస‌ర్స్ ప్రారంభించాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో గ‌త కొంత కాలంగా ఆగుతూ సాగుతూ వెళుతున్న స‌ద‌రు స్టార్ హీరో మూవీ కూడా ప‌ట్టాలెక్క‌బోతోంద‌ని తెలుస్తోంది. స‌ద‌రు స్టార్ హీరో భారీ ప్రాజెక్ట్ వెన‌క జ‌రిగిన అస‌లు స్టోరీ తెలిసిన వాళ్లంతా స్టార్ హీరో వెంట‌ప‌డ్డారు.. ఇప్ప‌డు బ్లేమ్ చేస్తున్నారా? అని కామెంట్ లు చేస్తున్నారు.