Begin typing your search above and press return to search.

బిత్తిరి సత్తి రేంజ్ ఇప్పుడు 'రేంజ్ రోవర్‌'

By:  Tupaki Desk   |   6 Oct 2022 9:30 AM GMT
బిత్తిరి సత్తి రేంజ్ ఇప్పుడు రేంజ్ రోవర్‌
X
బుల్లితెర మరియు వెండి తెరపై గత కొన్నాళ్లుగా చాలా బిజీగా కనిపిస్తున్న చేవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి తాజాగా రేంజ్ రోవర్‌ కారు కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యపర్చాడు. వీ6 లో తీన్మార్‌ వార్తలతో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న బిత్తిరి సత్తి అక్కడ నుండి వెను దిరిగి చూసుకోకుండా గత అయిదు ఆరు సంవత్సరాలుగా బాగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు.

టీవీ షో లు చేస్తూనే సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న బిత్తిరి సత్తి ఆదాయం ఈ మధ్య కాలంలో భారీగా పెరిగినట్లుగా వార్తలు వస్తూ ఉండేవి.

ఆ విషయం నిజమే అన్నట్లుగా తాజాగా బిత్తిరి సత్తి ఏకంగా రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశాడు. ఈ మధ్య కాలంలో టాప్ సెలబ్రెటీలకు మాత్రమే ఈ కారు ఉంటుంది. అలాంటిది బిత్తిరి సత్తి ఇంట్లో అడుగు పెట్టింది.

రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేసే స్థాయిలో బిత్తిరి సత్తి ఆదాయం ఉందా అంటూ చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు బిత్తిరి సత్తి ప్రయత్నించాడు.

ఆ సమయంలో సహాయ దర్శకుడిగా చాలా మంది దర్శకుల వద్ద ప్రయత్నాలు చేశాడట.. కానీ అవకాశం రాలేదు. నటనపై ఆసక్తితో బిత్తిరి సత్తి చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు.

జర్నలిజం తో వీ6 లో ఎంట్రీ ఇచ్చి సావిత్రి అలియాస్ జ్యోతి తో కలిసి తీన్మార్ వార్తలు చేయడం ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. బిత్తిరి సత్తి ఇప్పుడు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. నటుడు.. హోస్ట్‌.. యాంకర్‌.. యూట్యూబర్‌ ఇలా ఎన్నో విధాలుగా బిత్తిరి సత్తి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కింది స్థాయి నుండి వచ్చిన బిత్తిరి సత్తి ఎంతో మందికి ఆదర్శణం అనడంలో సందేహం లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.