Begin typing your search above and press return to search.

మహేష్‌ త్రివిక్రమ్‌.. ఓ పుట్టిన రోజు కానుక

By:  Tupaki Desk   |   17 May 2022 9:40 AM GMT
మహేష్‌ త్రివిక్రమ్‌.. ఓ పుట్టిన రోజు కానుక
X
సూపర్ స్టార్‌ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన సర్కారు వారి పాటకు నెగటివ్ కామెంట్స్ వచ్చినా వసూళ్ల విషయంలో చాలా పాజిటివిటీ కనిపిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాట సినిమా వస్తున్న వసూళ్ల నేపథ్యంలో హిట్ మూవీ అనే ముద్ర పడింది. ఇప్పుడు మహేష్ బాబు తదుపరి సినిమాపై చర్చ ప్రారంభం అయ్యింది.

మహేష్ బాబు తదుపరి సినిమా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అనే విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో గతంలో అతడు మరియు ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాలు థియేట్రికల్‌ రిలీజ్‌ లో డిజాస్టర్స్ గా నిలిచాయి. కాని శాటిలైట్‌ టెలికాస్ట్‌ లో మాత్రం బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పటికి అతడు సినిమా వస్తే మంచి రేటింగ్‌.. వ్యూవర్‌ షిప్ వస్తుందట. అందుకే వీరిద్దరి కాంబోలో మూడవ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఉన్నారు.

ఇప్పటికే మహేష్ బాబు.. త్రివిక్రమ్‌ మూవీ కన్ఫర్మ్‌ అయ్యింది. గత ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉంది. కరోనా వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో అయినా మహేష్‌ మూవీని పట్టాలెక్కించాలని త్రివిక్రమ్‌ భావించాడు.

కాని కొన్ని కారణాల వల్ల సర్కారు వారి పాట సినిమా విడుదల ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు సర్కారు వారి పాట విడుదల అవ్వడంతో త్రివిక్రమ్‌ పనులు మొదలు పెట్టాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జూన్ చివర్లో లేదా జులై ఆరంభంలో సినిమా షూటింగ్‌ ను మొదలు పెట్టాలనుకుంటున్నారట. అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ లోపు సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు అయిన మే 31వ తారీకున సినిమాకు సంబంధించిన అప్డేట్‌ ఇవ్వబోతున్నారట. ఆ రోజు సినిమా ఫస్ట్‌ లుక్‌ ను రివీల్‌ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాకు పార్థు అనే టైటిల్‌ ను మేకర్స్ పరిశీలిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. మే 31వ తారీకున టైటిల్‌ విషయంలో కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటికే సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారికంగా యూనిట్‌ సభ్యులు వెళ్లడించే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి సూపర్ స్టార్‌ కృష్ణ బర్త్ డే రోజు ఖచ్చితంగా మహేష్‌.. త్రివిక్రమ్‌ ల కాంబో మూవీ అప్‌డేట్ రావడం కన్ఫర్మ్‌.