`టక్కరిదొంగ` బిపాస ఇన్నాళ్లు ఏమైంది?

Sat Oct 17 2020 10:45:10 GMT+0530 (IST)

What happened to Bipasha in those years?

బాలీవుడ్ లో ఒకప్పుడు బోల్డ్ యాక్ట్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది బిపాస బసు. ఆ తరువాత `రాజ్` వంటి హారర్ థ్రిల్లర్ లతో ఆకట్టుకున్న బిపాష కెరీర్ ఎండింగ్ లోనూ అదే తరహా కథాంశంతో వచ్చిన `ఎలోన్`లో ఘోస్ట్ గా నటించి భయపెట్టింది. దాదాపు ఐదేళ్లుగా సినిమాలు దూరంగా వుంటున్నా భర్తతో కలిసి టీవీ ప్రొడక్షన్ సహా సినిమాలు నిర్మిస్తోంది. అలాగే ఇన్ స్టా వేదికగా అభిమానులతో టచ్ లో వుంటోంది.నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి కొంత కాలం డేటింగ్ చేసిన ఈ హాట్ దివ 2016లో అతన్నే పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. పెళ్లైనా ఫిట్ నెస్ విషయంలో కేర్ తీసుకుంటున్న బిపాస ఇప్పటికీ అదే హాట్ నెస్ తో రచ్చ లేపుతోంది. తాజాగా నెటిజన్స్ కోసం సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా బిపాష షేర్ చేసిన పిక్స్ కి ఆమె అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

ఈ లుక్ తో పాటు ఓ ఆసక్తికరమైన పోస్ట్ ని షేర్ చేసింది. `మిమ్మల్ని మీరు ఘాడంగా ప్రేమించండి. హనెస్టీగా విశ్వాసంతో వుండండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఓ సూపర్ పసవర్. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నమ్మడం మొదలుపెడతారో అప్పడే మ్యాజిక్ మొదలవుతుంది. ` అంటూ షేర్ చేసింది. పెళ్లై దాదాపు ఐదేళ్లవుతున్నా బిప్స్ అందంలో ఏ మాత్రం వన్నె తగ్గలేదు. అదే హాట్ నెస్ కనిపిస్తోంది. ప్రస్తుతం భర్త కరణ్ సింగ్ గ్రోవర్‌తో కలిసి వెబ్ సిరీస్ లో నటించింది. `డేంజరస్` పేరుతో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎమ్ ఎక్స్ ప్లేయర్ లో ఆగస్టులో విడుదలైంది. బిపాస బసు ఇంతకుముందు మహేష్ సరసన టక్కరి దొంగ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. నటించింది ఒకే సినిమా కానీ తెలుగులో అద్భుతమైన ఫాలోయింగ్ దక్కించుకుంది ఈ నల్లకలువ.