బింబిసార ఫస్ట్ వీక్ కుమ్మేసింది

Sat Aug 13 2022 11:32:25 GMT+0530 (IST)

Bimbisara's first week Record

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ ను దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన బింబిసార కేవలం మూడు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ సాధించింది. నాల్గవ రోజు నుండే బయ్యర్లకు మరియు నిర్మాతకు లాభాలను తెచ్చి పెట్టింది. మొదటి వారం పూర్తి అయ్యేప్పటికి ఈ సినిమా భారీ వసూళ్లను నమోదు చేసింది.దాదాపుగా 20 కోట్ల షేర్ ను ఈ సినిమా రాబట్టిందని అంటున్నారు. మొదటి వీక్ పూర్తి అయ్యేప్పటికి ప్రపంచ వ్యాప్తంగా 26 కోట్ల వసూళ్లను రాబట్టిందట. ఈ వారంలో ఆగస్టు 15 మరియు వీకెండ్ ను ఉపయోగించుకుని మినిమంగా 30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు మరియు బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో బింబిసార సినిమా కు పాజిటివ్ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సినిమా కు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కెరీర్ ఆరంభించినప్పటి నుండి ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ కు సాలిడ్ సక్సెస్ పడిందే లేదు. ఎట్టకేలకు ఈ సినిమా తో కళ్యాణ్ రామ్ కు కమర్షియల్ సక్సెస్ పడింది.

బింబిసార సినిమా లో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన కథ మరియు స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకునే విధంగా ఉందంటూ కామెంట్స్ వచ్చాయి.

ఈ సినిమా కు వశిష్ఠ్ దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన కారణంగా సినిమా వసూళ్లు భారీ గా నమోదు అవుతున్నాయి.