బింబిసార డబుల్ ధమాకా ... కాలం కలిసి రావడం అంటే ఇదేనేమో!

Tue Aug 09 2022 10:42:45 GMT+0530 (IST)

Bimbisara Movie Box Office Collections

నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా సంవత్సరాలుగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఎట్టకేలకు ఈ సినిమా తో కమర్షియల్ సక్సెస్ ను గట్టిగానే కొట్టాడు. కళ్యాణ్ రామ్ సినిమాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాలు ఏంటీ అంటే అతి తక్కువ అని చెప్పాలి. కాని ఈ సినిమా మాత్రం బ్రేక్ ఈవెన్ సాధించడంతో పాటు డబుల్ లాభాలను దక్కించుకోబోతున్నట్లుగా ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.ఈ సినిమా కి 13 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను సాధించింది. మొదటి మూడు రోజుల తర్వాత వసూళ్లు తగ్గుతాయని అంతా భావించారు. కానీ సోమవారం కూడా సినిమా భారీ వసూళ్లు సాధించి సాలిడ్ కమర్షియల్ సక్సెస్ దిశగా దూసుకు పోతుంది. మంగళవారం అంటే నేడు విద్యా సంస్థ లకు మొహరం పండుగ కారణంగా సెలవులు ఇచ్చారు.

మరో రెండు రోజుల్లో రాఖీ పౌర్ణమి సందర్భంగా సెలవు రాబోతుంది. ఆ వెంటనే మళ్లీ వీకెండ్.. ఆ వెంటనే ఆగస్టు 15వ తారీకు సెలవు.. ఇలా మొత్తంగా బింబిసార కు రాబోయే పది రోజుల వరకు భారీ ఎత్తున వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాలం కలిసి రావడం అంటే ఇది అంటూ బింబిసార విషయంలో ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇప్పటికే సినిమా బ్రేక్ ఈవెన్ ను సాధించి దాదాపుగా మూడు కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. సెలవులు మరియు లాంగ్ వీకెండ్ తో బింబిసార సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వారంలో నితిన్ మాచర్ల నియోజక వర్గం మరియు నిఖిల్ కార్తికేయ 2 సినిమాలు రాబోతున్నాయి. అయినా కూడా బింబిసార షేర్ రాబోయే వీకెండ్ లో డీసెంట్ గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బింబిసార తో నిర్మాత మరియు బయ్యర్లు డబుల్ ఫ్రాఫిట్ ను దక్కించుకోబోతున్నారు అంటూ ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ సినిమాగా నిలవడంతో పాటు ఈ ఏడాది మేటి సినిమాల్లో ఒకటిగా కూడా నిలవబోతోంది అంటూ నందమూరి అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.

బింబిసార నాల్గవ రోజు వసూళ్లు :

నైజాం : 81 లక్షలు
వైజాగ్ : 32 లక్షలు
సీడెడ్ : 55 లక్షలు
కృష్ణ : 12 లక్షలు
గుంటూరు : 15 లక్షలు
నెల్లూరు : 6 లక్షలు
ఈస్ట్ : 13 లక్షలు
వెస్ట్ : 10 లక్షలు
4వ రోజు మొత్తం : 2.24 కోట్లు
ఏపీ తెలంగాణ మొత్తం 4 రోజుల వసూళ్లు : 18.2 కోట్లు