Begin typing your search above and press return to search.

బింబిసార చిన్నారి.. బిజీ ఆర్టిస్ట్!

By:  Tupaki Desk   |   8 Aug 2022 7:56 AM GMT
బింబిసార చిన్నారి.. బిజీ ఆర్టిస్ట్!
X
కళ్యాణ్ రామ్ నటించిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీలో అన్ని పాత్రల కంటే కూడా ఒక చిన్నారి పాత్ర ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కథలో చాలా కీలకమైన పాత్రలో కనిపించిన చిన్నారి శ్రీదేవి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ఇంత బాగా నటించిన ఈ అమ్మాయి ఎవరు అని ఇంటర్నెట్లో కూడా నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు.

ఇక ఈ అమ్మాయి అసలు పేరు శ్రీదేవి. బేతంచెర్ల పట్టణానికి చెందిన ఈ చిన్నారి ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాలేదు. ఇదివరకే ఆమె బుల్లితెరపై కనిపించింది. అలాగే మరికొన్ని సినిమాల్లో కూడా నటించింది. నటనలో ఎంతగానో ఆకట్టుకుంటూ ఉండటంతో వరుసగా అవకాశాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం చైల్డ్ ఆర్టిస్టులలో ఈ బ్యూటీ ఒక సూపర్ స్టార్ అని కూడా చెప్పవచ్చు.

ఎందుకంటే చాలాకాలంగా చైల్డ్ ఆర్టిస్టులు కంటిన్యూగా అవకాశాలు పెద్దగా అందుకోవటం లేదు. కానీ శ్రీదేవి మాత్రం ఎడతెరిపి లేకుండా అవకాశాలు అందుకుంటుంది. ఇప్పటివరకు ఆమె 10 సినిమాల్లో అలాగే 15 టీవీ సీరియల్ లో నటించింది.

ఇక ఆమె బ్యాక్ గ్రౌండ్ విషయానికి వెళితే తండ్రి పేరు శ్రీహరి గౌడ. అతను హైదరాబాదులోనే తెలుగు చిత్ర పరిశ్రమలో గత 18 ఏళ్లుగా కొనసాగుతున్నారు. పలు సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా వర్క్ చేశారు. ఇంకా కొనసాగుతూనే ఉన్నారు.

ఈ క్రమంలో తన చిన్న కూతురు శ్రీదేవికి అనుకోకుండా ఒక సీరియల్లో అవకాశం వచ్చింది. నాలుగో తరగతి చదువుతున్న శ్రీదేవి పౌర్ణమి, చెల్లెలికాపురం, ముద్దమందారం, కల్యాణ వైభోగం ఇలా పలు సీరియల్స్ లో మంచి పాత్రలో నటించింది. ముఖ్యంగా ఈటీవీలో వస్తున్న యమలీల సీరియల్ లో కూడా ప్రధాన పాత్రలో ఎంతగానో గుర్తింపును అందుకుంటుంది. ప్రస్తుతం కూడా ఈ చిన్నారి చేతిలో మరికొన్ని సీరియల్స్ ఉన్నాయి. అలాగే మరో మూడు సిరిమల కూడా నటించాల్సి ఉందట.

ఒకవైపు తన స్కూలింగ్ ను కొనసాగిస్తూనే మరొకవైపు వెండితెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చాలా బిజీగా మారిపోతుంది. రీసెంట్ గా రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో కూడా కనిపించిన విషయం తెలిసిందే. ఇక అంతకుముందు మేజర్ సినిమాలో అలాగే సూపర్ మచ్చి సినిమాల్లో కూడా మంచి పాత్రల్లో కనిపించింది. చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో శ్రీదేవి తెలుగు చిత్ర పరిశ్రమలో మరో రేంజ్ కు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా అర్థమవుతుంది.