Begin typing your search above and press return to search.

సుశాంత్‌ : బీహార్‌ పోలీసులకు ఎందుకు ఇంత శ్రద్ద?

By:  Tupaki Desk   |   9 Aug 2020 4:30 PM GMT
సుశాంత్‌ : బీహార్‌ పోలీసులకు ఎందుకు ఇంత శ్రద్ద?
X
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ రాజ్‌ పూత్‌ మృతి కేసు కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. అయినా కూడా బీహార్‌ పోలీసులు మాత్రం కేసు విషయంలో కీలక విషయాలను సేకరించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. సుశాంత్‌ బీహార్‌ కు చెందిన వ్యక్తి అవ్వడంతో పాటు ఆయన తండ్రి కేకే సింగ్‌ కు పోలీసు శాఖలో మంచి పట్టు ఉంది. అందుకే సుశాంత్‌ కేసు విషయమై బీహార్‌ పోలీసులు చాలా ఎక్కువ శ్రద్ద పెడుతున్నారట. కేంద్ర ప్రభుత్వంకు బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ సీబీఐకి అప్పగించాలంటూ సిఫార్సు చేయడంతో పాటు ఇంకా కూడా తమ ఉన్నతాధికారులను ఆ కేసు విషయంలో విచారించాల్సిందిగా సూచించారు.

ముంబయిలో పాట్నా పోలీసులకు సహకారం దక్కలేదు. ముంబయి పోలీసులు కనీసం సరైన వాహనం కూడా పాట్నా పోలీసులకు ఇవ్వక పోవడంతో పాటు క్వారెంటైన్‌ ఉండాలంటూ ఐపీఎస్‌ కు ముద్ర వేశారు. అందుకే రహస్యంగా ముంబయిలో పలువురిని పాట్నా పోలీసులు విచారించారట. ఈ విషయాన్ని పాట్నా పోలీసులు తెలియజేశారు. ఖగోళ శాస్త్రంకు చెందిన శాస్త్రవేత్తలుగా మేము ముంబయిలో తిరిగాం. బాలీవుడ్‌ కు చెందిన ఎంతో మందిని ప్రశ్నించామని ఈ సందర్బంగా వారు పేర్కొన్నారు.

ముంబయి పోలీసులు తమ దర్యాప్తును అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అయినా మేము అనుకున్నది చేశామన్నారు. మేము సేకరించిన వివరాలు ఖచ్చితంగా సీబీఐ వారికి కీలకంగా మారుతాయనే నమ్మకంను వారు వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్‌ కేసు విషయంలో బీహార్‌ పోలీసులు మరీ ఇంత శ్రద్ద చూపడం ఆశ్చర్యంగా ఉందని బాలీవుడ్‌ వర్గాల వారు సైతం ఆశ్చర్యపోతున్నారు.