Begin typing your search above and press return to search.

450 కోట్లతో బిగ్గెస్ట్ మల్టీస్టారర్

By:  Tupaki Desk   |   29 Jan 2023 9:00 AM GMT
450 కోట్లతో బిగ్గెస్ట్ మల్టీస్టారర్
X
2017లో సుందర్ సి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు తెలిపారు. అదే ఏడాది ఫిల్మ్ ఫెస్టివల్ లో సంఘమిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు. అయితే జయం రవి, ఆర్య, శ్రుతి హాసన్, దిశా పటాని ప్రధాన పాత్రల్లో ప్రకటించిన ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే.. డైరెక్టర్ సుందర్ సి తన డ్రీమ్ ప్రాజెక్టును రూపొందించేందుకు మళ్లీ సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ ఏడాది అక్టోబ‌ర్‌లోనే ఈ సినిమా పట్టాలు కూడా ఎక్కబోతోంది. అయితే గతంలో ఈ సినిమాలో హీరోగా జయం రవిని అనుకోగా... ఇప్పుడు ఆ పాత్రలో విశాల్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదండోయ్.. పొన్నియన్ సెల్వన్ స్థానంలో ఆర్యను తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సుందర్ సి అరణ్మనై 4 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే ఇది పూర్తి అయిన వెంటనే సంఘమిత్ర సెట్స్ పైకి వెళ్లనుంది.

సంఘమిత్ర ను రెండు భాగాల్లో రూపొందించబోతున్నారు. పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించాలని డైరెక్టర్ సుందర్ సి భావిస్తున్నారు. బాహుబలి సినిమా అంతటి రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను ఈ ఏడాది ద్వితీయార్థంలో తెలపుబోతున్నట్లు సమాచారం. గతంలో ఈ సినిమా కోసం డైరెక్టర్ సుందర్ సి జయం రవి తన రెండేళ్లు కాల్షీట్లను ఇవ్వాల్సిందిగా కోరారట. అందుకు అతడు కూడా ఒప్పుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ప్రముఖ నిర్మాణ సంస్థ తేనాండాళ్ 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు గతంలో ప్రకటించింది. ఆ తర్వాత ఈ సినిమాలో చేస్తానని చెప్పిన శృతి హాసన్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆ తర్వాత మరో హీరోయిన్ కోసం డైరెక్టర్ ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు.

కానీ ఎవరూ సెట్ కాలేదు. హన్సిక, అంజలి, ఓవిలియా పేర్లు కూడా వినిపించినప్పటికీ.. ఆ సినిమా పలు కారణాల వల్ల ఆగిపోయింది. మరోసారి తెరపైకి రావడంతో అందరూ ఈసారి అయినా ఈ సినిమా పట్టాలెక్కితే బాగుంటుందని భావిస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది, ఎవరెవరు అందులో నటిస్తారో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.