Begin typing your search above and press return to search.

మహేశ్ ను చూస్తే మతిపోయిందండీ బాబూ!

By:  Tupaki Desk   |   19 Jan 2022 2:30 AM GMT
మహేశ్ ను చూస్తే మతిపోయిందండీ బాబూ!
X
మహేశ్ బాబును హీరోగా చేద్దామని అనుకుంటున్నట్టు ఒక సందర్భంలో రాఘవేంద్రరావుతో కృష్ణ అంటే, అంతకుముందే మహేశ్ ను చూసిన రాఘవేంద్రరావు, ఆయనతో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సినిమాలు తీసుకోవచ్చు అని అన్నారట. ఆ వార్త బయటికి వచ్చినప్పుడు .. అప్పటికి మహేశ్ బాబును చూసిన వాళ్లు నిజమేనని అనుకున్నారు. ఇప్పటికీ తెరపై ఆయనను చూస్తే అందరికీ కలిగే ఫీలింగ్ అదే. ఆయన కలర్ .. ఆయన స్టైల్ .. ఆయన డైలాగ్ చెప్పేతీరు అందరినీ కట్టిపడేస్తుంది.

మహేశ్ బాబు మంచి పొడగరి .. హైటుకి తగిన పర్సనాలిటీతో ఆయన చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. ఆయన స్టైల్ ను కుర్రాళ్లు ఎంతలా ఫాలో అవుతారో, అమ్మాయిల్లోను ఆయనకి అంతే ఫాలోయింగ్ ఉంది. అందంగా ఉండటమంటే మహేశ్ బాబులా ఉండటం అనేది అమ్మాయిలు చెప్పుకునే కొలమానం. అంతగా మహేశ్ బాబు యూత్ హృదయాలను కొల్లగొట్టేశాడు. మహేశ్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చేసి చాలాకాలమైంది. ఆయన తరువాత కూడా చాలామంది హీరోలు తెరపైకి వచ్చారు. కానీ ఇప్పటికీ అందగాడంటే మహేశ్ బాబునే. హ్యాండ్సమ్ అనే మాటకి అసలైన అద్దం .. అర్థం ఆయనే అనేది అభిమానులు చెప్పేమాట.

ఆయనతో కలిసి నటించిన వారు కూడా ఇదేమాట చెబుతారు .. అదే మాటను 'దివి' కూడా చెప్పింది. అంతకుముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన దివి, 'బిగ్ బాస్' కి వెళ్లిన తరువాతనే పాప్యులర్ అయింది. బిగ్ బాస్ హౌస్ లో తనదైన స్టైల్ ను ఆవిష్కరిస్తూ ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె గ్లామర్ బిగ్ బాస్ హౌస్ కి ప్రత్యేక ఆకర్షణగా మారింది. అప్పటికే ఆమె 'మహర్షి' సినిమాలో చిన్నపాటి రోల్ చేసింది. అదే ఆమెకి ఫస్టు మూవీ. ఆ సినిమా షూటింగు సమయంలో జరిగిన సంఘటనను గురించి ఆమె తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

"నా ఫస్టు మూవీనే నేను మహేశ్ బాబుగారితో చేశాను. 'మహర్షి' సెట్లో ఆయన చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు. అమ్మాయిలమంతా ఒక పక్కన కూర్చుని ఉన్నాము. మా ముందు నుంచి ఆయన అటూ ఇటూ వెళుతూ ఉంటే, 'ఎంత బాగున్నాడో కదా .. ఎంతబాగున్నాడో కదా' అంటూ అందరం సిగ్గుపడిపోయాము. ఆయన స్కిన్ టోన్ .. హెయిర్ స్టైల్ .. నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. నా కెరియర్ మహేశ్ సార్ సినిమాతోనే మొదలైంది కనుక, నాకు తెలియకుండానే ఆయనతో ఒక బాండింగ్ అనేది ఏర్పడిపోయింది.

'మహర్షి' చూసేటప్పుడు నేను ఎవరో తెలియకపోయినా, 'బిగ్ బాస్' చూసినప్పుడు అందరూ నన్ను గుర్తుపట్టారు. మహేశ్ సార్ తో నాకు నాలుగైదు సీన్స్ ఉండేవి .. కానీ అవి ఎడిటింగ్ లో ఎగిరిపోవడం వలన ఒకటి రెండు బిట్స్ మాత్రమే ఉండిపోయాయి. సార్ తో నాకు ఒక చిన్న బిట్ అయినా ఓకే .. ఒక ఫ్రేమ్ లో కనిపించినా ఓకే" అని చెప్పుకొచ్చింది.