బిగ్ బాస్ నాన్ స్టాప్.. నాగ్ మళ్లీ ఓకే చెప్పేనా?

Sun May 22 2022 19:00:01 GMT+0530 (IST)

BiggBossNonStop now on OTT

తెలుగు బిగ్ బాస్ ను ప్రేక్షకులు ఆదరించారు. ప్రతి ఒక్క సీజన్ కు కూడా మంచి ఆదరణ దక్కింది. మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్టింగ్ చేయడం వల్ల జనాల్లోకి బిగ్ బాస్ అనేది బాగా వెళ్లింది. ఆ తర్వాత నాని హోస్టింగ్ చేయడం వల్ల కాస్త షో విషయంలో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత నుండి నాగార్జున తన చేతిలోకి తీసుకుని వరుసగా మూడు.. నాలుగు.. అయిదు సీజన్ లకు హోస్టింగ్ చేశాడు.బిగ్ బాస్ అన్ని సీజన్ లు కూడా పర్వాలేదు అన్నట్లుగా మంచి రేటింగ్ తో పాటు నిర్వాహకులకు మంచి లాభాలను తెచ్చి పెట్టాయి. అందుకే హిందీలో చేసిన డిజిటల్ ప్రయోగంను తెలుగు లో తీసుకు వచ్చారు. తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24/7 ఫార్మట్ అంటూ ప్రచారం చేసి స్ట్రీమింగ్ చేసిన విషయం తెల్సిందే. చాలా మంది లైవ్ స్ట్రీమింగ్ పట్ల చాలా ఆసక్తిని కనబర్చారు.

జనాలు భావించినంత రక్తి కట్టించేలా లైవ్ స్ట్రీమింగ్ లేక పోవడంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు షో లైవ్ స్ట్రీమింగ్ ను క్యాన్సిల్ చేయడం జరిగింది. మొదట్లో రోజుకు రెండు ఎపిసోడ్స్ ఇచ్చారు. ఆ తర్వాత రోజులో ఒక్కటే ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయడం జరిగింది. అలా బిగ్ బాస్ నాన్ స్టాప్ రకరకాలుగా మారుతూ వచ్చింది. ఎట్టకేలకు షో ముగిసింది.. బిందు మాధవి విన్నర్ గా నిలిచింది.. అఖిల్ రన్నర్ గా నిలిచాడు.

తెలుగు బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ మొదటి సీజన్ పూర్తి అయ్యింది. మరి కొన్ని నెలల్లో రెగ్యులర్ టీవీలో ప్రసారం అయ్యే బిగ్ బాస్ ఆరవ సీజన్ ప్రారంభం అవ్వాల్సి ఉంది. ఆరో సీజన్ కు సంబంధించిన హింట్ ను నాగార్జున ఇవ్వడం జరిగింది. అది మరి ఎంతో దూరం లేదు.. ఆలస్యం లేదు అన్నట్లుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే ఓటీటీ బిగ్ బాస్ మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే డౌటే అన్నట్లుగా ఉంది పరిస్థితి.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు మరియు షో నిర్వాహకులు భారీగా ఖర్చు చేయడం జరిగింది. అయితే రెగ్యులర్ బిగ్ బాస్ కు వచ్చిన స్థాయిలో హైప్ రాలేదు. ఆ విషయం ను ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. అందుకే ఓటీటీ లో బిగ్ బాస్ నాన్ స్టాప్ కంటిన్యూ అయ్యేనా అనేది చర్చనీయాంశంగా మారింది. రెగ్యులర్ బిగ్ బాస్ తో పోల్చితే నాన్ స్టాప్ కు నాగార్జున హోస్టింగ్ చేసే విషయంలో ఆసక్తిగా ఉన్నాడా అనేది అనుమానం.

నాగార్జున బిగ్ బాస్ నాన్ స్టాప్ విషయంలో మొదట్లో ఉన్నంత ఆసక్తి తో చివరి వరకు లేడు అనేది కొందరి అభిప్రాయం. అందులో ఎంత వరకు నిజం ఉంది అనే విషయం తెలియదు... కాని ఖచ్చితంగా ఆయన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 2 కు ఆయన ఓకే చెప్పేనా అంటూ లేదు అని సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. మరి ఆయన అభిప్రాయం.. ఆసక్తి ఏంటి అనేది చూడాలి.