ఈసారి 'క్వారంటైన్ బిగ్ బాస్' అని పిలవాలా?

Mon Aug 03 2020 20:08:38 GMT+0530 (IST)

Call it the 'Bigg Boss' this time around?

ఈసారి బిగ్ బాస్ సీజన్ 4 ను గ్లామర్ కంటెంట్ తో హీట్ పెంచేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షోలో పాల్గొనే 16 మంది పార్టిసిపెంట్స్ ని ఎంపిక చేశారని సమాచారం. కింగ్ నాగార్జున హోస్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రోమో రెడీ అయ్యింది.అయితే హైదరాబాద్ లో కోవిడ్ విలయం నేపథ్యంలో బిగ్ బాస్ హోస్ట్ సహా ఇంటి సభ్యుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే.. కట్టుదిట్టమైన ఏర్పాట్లలోనే ఉన్నారట స్టార్ మా వాళ్లు. ఇప్పటికే పలుమార్లు కోవిడ్ టెస్టులు నిర్వహించారు ఆ పదహారు మందికి. అందరికీ నెగెటివ్ వచ్చిందట. వీళ్లను కొన్నాళ్ల పాటు ఒక రహస్య ప్రదేశంలో క్వారంటైన్ కి పంపిస్తున్నారట. క్వారంటైన్ కి పంపే ముందు కోవిడ్ టెస్టులు మరోసారి చేయనున్నారట. మళ్లీ షోలో పాల్గొనే ముందు కూడా టెస్టులు ఖాయం చేశారట. అంతేకాదు అప్పటికప్పుడు ఆనారోగ్యం తలెత్తినా ఆ పార్టిసిపెంట్ స్థానంలో ఆల్టర్నేట్ కొందరిని రెడీ చేసి పెట్టుకున్నారని తెలుస్తోంది.

యాంకర్లు మంజూష.. వర్షిణి లాంటి టాప్ గ్లామర్ ఈసారి బిగ్ బాస్ ఇంటిని హీటెక్కించబోతోందని సమాచారం. ఈసారి సీజన్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. ఎప్పటిలానే లేడీ పార్టిసిపెంట్స్ కి ఫ్రెగ్నెన్సీ సహా ఇతర ఆరోగ్య సమస్యలకు సంబంధించి టెస్టులు చేశారట. కోవిడ్ టెస్టులు ఈసారి అదనం అని తెలిసింది. ఇక హోస్ట్ నాగార్జునకు ఎలాంటి ఇబ్బంది లేకండా ఎంతో జాగ్రత్తలు పాటిస్తున్నారని సమాచారం. అమితాబ్ లాంటి స్టార్ కి కోవిడ్ సోకడంతో అదో అలెర్ట్ లాగా పని చేస్తోందట.