ఫొటోటాక్ : బిగ్ బాస్ బ్యూటీ నడుము అందం చూపిస్తూ చంపేస్తుంది

Mon Dec 05 2022 13:00:58 GMT+0530 (India Standard Time)

Bigg Boss beauty kills by showing off her waist beauty

చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో ఉన్నా కూడా దివి కి బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు దక్కింది. హీరోయిన్ పీస్ అంటూ దివికి బిగ్ బాస్ లో ఉండగానే అభిమానులు క్రియేట్ అయ్యారు. అప్పటి నుండి ఈ అమ్మడి యొక్క అభిమానులు పెరుగుతూనే ఉన్నారు.సినిమాలు మరియు సిరీస్ లు చేయడం వల్ల మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న దివి సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో అందాల ఆరబోత చేస్తూ తెగ హడావుడి చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి యొక్క అందాలు రెగ్యులర్ గా ఇన్ స్టా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

తాజాగా ఈ ఫొటోలను షేర్ చేసిన దివి మరోసారి నెటిజన్స్ మతులు పోగొట్టింది. నడుము మరియు నాభి అందాలను చూపిస్తూ ఈ అమ్మడి యొక్క అందాల విందు చేస్తూ ఉంది. స్టైలిష్ లుక్ లో హొయలు పోతూ నడుము అందాన్ని చూపించిన దివిని చూస్తూ ఉంటే బాలీవుడ్ ముద్దుగుమ్మలను చూసినట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

బిగ్ బాస్ బ్యూటీ దివి ఈ రేంజ్ లో అందంగా ఉన్నప్పటికి కేవలం తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల సినీ జనాలు పట్టించుకోవడం లేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. పాపం దివికి ఇతర భాషల నుండి అయినా ఆఫర్స్ రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఇంత అందం కేవలం సోషల్ మీడియాకే పరిమితం అవ్వకుండా సిల్వర్ స్క్రీన్ పై మెరవాలని అభిమానులు ఆశిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.