నిజమైన పులులతో బిగ్ బాస్ 'పులి'.. ఏం చేశాడంటే??

Tue Feb 23 2021 18:13:43 GMT+0530 (IST)

Bigg Boss 'Tiger' with real tigers

తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్.. నాలుగవ సీజన్ ఎంత రసవత్తరంగా సాగిందో టీవీ ప్రేక్షకులందరికి తెలిసిందే. అయితే బిగ్ బాస్ సీజన్ మొదలైన దగ్గర నుండి ఫేవరేట్ కంటెస్టెంట్లను బిగ్ బాస్ ఫాలోయర్స్ అభిమానులు సోషల్ మీడియా యూజర్స్ ఓట్లు వేస్తూ తమ కంటెస్టెంటును గెలిపిస్తూ వచ్చారు. మొత్తానికి ఫైనల్ బిగ్ బాస్ టైటిల్ అభిజిత్ గెలిచాడు.బిగ్ బాస్ టైటిల్ గెలిచాడో లేదో అలా తనను ఓటేసి గెలిపించిన వారికీ అండగా నిలిచిన సెలబ్రిటీలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చాడు. నిజానికి టైటిల్ రాగానే అభిమానులను ఉద్దేశించి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చిన అభిజిత్.. బయటికి రాగానే వరుసగా ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. హీరోలు నటులతో పాటు తనకు సినిమా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ శేఖర్ కమ్ములను కలిసాడు. ఇదంతా బిగ్ బాస్ తర్వాత కానీ అభిజిత్ ఇప్పుడేం చేస్తున్నాడంటే..

బిగ్ బాస్ నుండి బయటికి రాగానే కంటెస్టెంట్స్ అంతా కూడా యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి వీడియోs పోస్ట్ చేస్తున్నారు. అయితే వాళ్లలాగే అభిజిత్ కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాడు. ఈ హీరో ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టపడతాడట. అందుకే అప్పుడప్పుడు ఏదొక ట్రావెలింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాడు. బిగ్ బాస్ లో పులి అనే ట్యాగ్ లైన్ సొంతం చేసుకున్నాడు అభిజిత్. నెటిజన్లు కూడా ఎక్కువగా పులి అనే కామెంట్స్ చేస్తుంటారు.

ఇప్పుడు అదే ట్యాగ్ లైన్ పై ఫ్రీడమ్ అండ్ పులి కాన్సెప్ట్ తో ఓ ట్రావెల్ వీడియోను రెడీ చేస్తున్నాడట. ఇటీవల అభిజీత్ ఫారెస్ట్ లో తిరిగినట్లు తెలుస్తోంది. వీడియో ఫుటేజ్ కోసం స్పెషల్ గా ఓ టీమ్ రెడీ చేసుకొని వెళ్లినట్లు వీడియోలో చెప్పాడు అభి. స్పెషల్ గా బైక్ వేసుకొని చేతిలో కెమెరా పట్టుకొని టైగర్స్ ఫొటోలను తీయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. అడవిలో తిరిగే పులులను ఫొటోలు తీస్తుంటే కొంతమంది ఫ్యాన్స్ అభిజిత్ తో ఫోటోలు దిగారట. త్వరలోనే ఆ ఫుల్ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు అభిజిత్.