Begin typing your search above and press return to search.

బిబి4 : అఖిల్‌ ను ఏడిపించి.. కుమార్‌ సాయి ఎలిమినేట్‌

By:  Tupaki Desk   |   19 Oct 2020 3:30 AM GMT
బిబి4 : అఖిల్‌ ను ఏడిపించి.. కుమార్‌ సాయి ఎలిమినేట్‌
X
బిగ్‌ బాస్‌ ఆరవ వారం పూర్తి అయ్యింది. నేటి నుండి ఏడవ వారం ప్రారంభం అవుతోంది. ఆరవ వారంలో కుమార్‌ సాయి ఎలిమినేట్‌ అంటూ ముందుగానే లీక్‌ వచ్చింది. అన్నట్లుగానే కుమార్‌ సాయిని ఎలిమినేట్‌ చేయడం జరిగింది. కుమార్‌ సాయి కంటే కూడా మోనాల్‌ గజ్జర్‌ కు ఓట్లు తక్కువ వచ్చాయి అంటూ సోషల్‌ మీడియాలో బలంగా టాక్‌ వచ్చింది. కాని ఆమెను ఉంచాలని.. ఆమె ఉంటే కాస్త రొమాంటిక్‌ ఫుటేజ్‌ ఉంటుందని బిగ్‌ బాస్‌ నిర్వాహకులు భావిస్తున్నట్లుగా ఉన్నారు. అందుకే ఆమెను ఉంచారు. నిన్నటి ఎపిసోడ్‌ లో కుమార్‌ సాయి మరియు మోనాల్‌ ఇద్దరు కూడా లాస్ట్‌ వరకు సేవ్‌ అవ్వలేదు. ఇద్దరు కన్ఫెషన్‌ రూంకు రమ్మంటూ పిలిచిన సమయంలో అఖిల్‌ కన్నీరు పెట్టుకున్నాడు.

ఎప్పుడు గంభీరంగా ఉండే అఖిల్‌ ఎప్పుడైతే మోనాల్‌ వెళ్తుందని నాగార్జున అన్నాడో వెంటనే ఎమోషనల్‌ అయ్యాడు. అఖిల్‌ కన్నీరు ఆగలేదు. చాలా యాటిట్యూడ్‌ చూపించే అఖిల్‌ కళ్లలో నీళ్లు ఆగలేదు. మోనాల్‌ వెళ్లిన తర్వాత కూడా చాలా బాధ పడ్డాడు. ఎప్పుడైతే మోనాల్‌ మళ్లీ కన్ఫెషన్‌ రూం నుండి వచ్చిందో అప్పుడు అఖిల్‌ కళ్లు ఆనందంతో వెలిగి పోయాయి. ఇద్దరి మద్య కెమిస్ట్రీ నడుస్తుందని అందరికి తెలిసిందే. మొన్నటి వరకు వీరి మద్యలో అభిజిత్‌ ఉండేవాడు. కాని అతడు ఇప్పుడు మోనాల్‌ అబద్దాల కోరు అంటూ సంచలన ఆరోపణ చేసి ఆమెకు పూర్తిగా దూరం వచ్చేశాడు. దాంతో ఆ ఇద్దరి మద్య రొమాన్స్‌ నడుస్తోందంటున్నారు. అఖిల్‌ కళ్లలో ఆమెపై ప్రేమ కనిపిస్తుంది. కాని మోనాల్‌ కు మాత్రం అతడు ఫ్రెండ్‌ మాత్రమే అన్నట్లుగా ఉంటుంది.

నిన్నటి ఎపిసోడ్‌ లో కుమార్‌ సాయి మరియు మోనాల్‌ లు మాత్రమే ఎలిమినేషన్‌ కు మిగిలి ఉన్న సమయంలో అరియానాను నాగార్జున సరదాగా ఈ ఇద్దరిలో ఎవరు ఉండాలని అనుకుంటున్నావు అంటూ అడుగగా తడుముకోకుండా కుమార్‌ సాయి ఉంటే ఆట బాగుంటుందని భావిస్తున్నాను అంది. దాంతో మోనాల్‌ చాలా బాధపడింది. అంతకు ముందు సరదా గేమ్స్‌ తో ప్రేక్షకులను ఇంటి సభ్యులు మరియు నాగార్జున ఎంటర్‌ టైన్‌ చేశారు. కుమార్‌ సాయి ఎలిమినేషన్‌తో మొత్తం ఆరుగురు ఇప్పటి వరకు బయటకు వెళ్లి పోయారు. ఈ వారం లేదా వచ్చే వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉండే అవకాశం ఉందని స్టార్‌ మా వర్గాల వారు అంటున్నారు.