Begin typing your search above and press return to search.

ఏడ్చేసిన బిగ్ బాస్ ఇంటి స‌భ్యుడు .. అప్పు తీర్చ‌లేద‌ని నిర్మాత కాళ్ల‌రిగేలా!

By:  Tupaki Desk   |   20 Sep 2020 5:15 AM GMT
ఏడ్చేసిన బిగ్ బాస్ ఇంటి స‌భ్యుడు .. అప్పు తీర్చ‌లేద‌ని నిర్మాత కాళ్ల‌రిగేలా!
X
ప్ర‌స్తుతం లైవ్ లో ఉన్న బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 4 ర‌స‌వ‌త్త‌రంగా మార‌లేదు కానీ.. సోసోగానే అయినా కొన్ని వెరైటీ డ్రామాలు మెప్పిస్తున్నాయ‌న్న టాక్ ఉంది. ఇక ఇప్ప‌టికే ఇంటి నుంచి ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వెళ్లే స‌న్నివేశం క‌నిపిస్తోంది. తొలిగా ద‌ర్శ‌కుడు సూర్య కిర‌ణ్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చాక‌ ప‌లు యూట్యూబ్ చానెళ్ల‌ ఇంట‌ర్వ్యూల్లో త‌న భార్యామ‌ణి క‌ళ్యాణి నుంచి విడాకులు తీసుకోవ‌డంపై ఎమోష‌న్ అవుతుండ‌డం క‌నిపించింది. 10కోట్లు ఇండ‌స్ట్రీలో పెట్టి న‌ష్ట‌పోయాన‌ని తెలిపారు.

ఇక‌పోతే వేరొక పార్టిసిపెంట్ కం డైరెక్ట‌ర్ గురించి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. స‌ద‌రు ఇంటి స‌భ్యుడు చాలా ఎమోష‌న‌ల్. అమ్మాయిలా ఎమోష‌న్ ని దాచుకోలేక ఏడ్చేయ‌డంతో అది కాస్తా గుస‌గుస‌లకు తావిచ్చింది. ఇక ఫేడ‌వుట్ ద‌ర్శ‌కుడిగా పాపుల‌రైనా ఆయ‌న గ‌తం గురించి ఇప్పుడు మ‌రోసారి వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది.

స‌ద‌రు పార్టిసిపెంట్ ఇంత‌కుముందు ఓ ప్ర‌ముఖ నిర్మాత‌ వ‌ద్ద అడ్వాన్సులు తీసుకుని సినిమాలు చేయ‌లేద‌న్న గుస‌గుసా తాజాగా తెర‌పైకొచ్చింది. ఓ ప్ర‌ముఖ పత్రికాధినేత కం చిన్న సినిమాల‌ నిర్మాత అప్ప‌ట్లో ఆయ‌న‌కు అడ్వాన్సు ఇచ్చాడు. అయితే కాల‌క్రమంలో స‌ద‌రు ద‌ర్శ‌కుడు కం పార్టిసిపెంట్ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఆయ‌న‌తో సినిమా చేయ‌లేదు. కానీ ఆ ప‌త్రికాధినేత మాత్రం త‌న అనుయాయుల్ని అడ్వాన్స్ క‌లెక్ట్ చేసుకుని రావాల్సిందిగా పంపించేవారు. మ‌రి ఇప్ప‌టికి అయినా ఆ స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యిందో లేదో? అంటూ గుస‌గుస‌లు వేడెక్కించేస్తున్నాయ్. ఇంత‌కీ ఆ పార్టిసిపెంట్ ఎవ‌రు? అన్న‌ది మాత్రం బిగ్ బాస్ వీక్ష‌కులే ఈజీగా గుర్తించ‌వ‌చ్చు.