క్లిక్ క్లిక్ : బిగ్ బాస్ బ్యూటీ బీఎండబ్ల్యూ కొనేసింది

Wed Jan 26 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Bigg Boss Lahari buys BMW

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో తన గ్లామర్ తో అలరించిన ముద్దుగుమ్మ లహరి షరి ఉన్నది కొన్ని రోజులు అయినా కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. మోడలింగ్ తో ఇన్నాళ్లు రాని గుర్తింపు ఈ కొన్ని రోజుల్లోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. బిగ్ బాస్ వల్ల ఈ అమ్మడు స్టార్ గా నిలిచింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఇప్పటికే మంచి క్రేజ్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ అమ్మడు తనకు ఇష్టమైన బీఎండబ్ల్యూ బైక్ ను కొనుగోలు చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలను ఈ అమ్మడు షేర్ చేసింది.ఎట్టకేలకు నేను కోరుకున్న నా బైక్ ఇంటికి వచ్చేసింది అంటూ లహరి షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సిటీ మరియు హైవేలపై ఇక ముందు తన రైడ్ కొనసాగబోతుంది అన్నట్లుగా ఈ అమ్మడు ఫొటోలతో పాటు కామెంట్ పెట్టింది. యాంకర్ గా మెల్ల మెల్లగా అవకాశాలు దక్కించుకుంటున్న లహరి తాజాగా బంగార్రాజు సినిమా యూనిట్ సభ్యులను ఇంటర్వ్యూ చేయడం మాత్రమే కాకుండా బంగార్రాజు మ్యూజికల్ ఈవెంట్ కు కూడా బిగ్ బాస్ బ్యూటీ లహరి యాంకరింగ్ చేసి మెప్పించింది. ముందు ముందు ఈ అమ్మడు మరింతగా షో కు హోస్టింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

బిగ్ బాస్ సీజన్ 5 తో గుర్తింపు దక్కించుకున్న పలువురు కంటెస్టెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను దక్కించుకున్నారు. అంతే కాకుండా బిగ్ బాస్ బాస్ ద్వారా వచ్చిన గుర్తింపు తో సినిమా ల్లో కూడా నటిస్తూ ఆకట్టుకుంటూ ఉన్నారు. ప్రియాంక సింగ్ మరియు ఇంకా పలువురు కంటెస్టెంట్స్ కు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. విన్నర్ గా నిలిచిన సన్నీ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి బిగ్ బాస్ తో కంటెస్టెంట్స్ కు మంచి గుర్తింపు దక్కించుకున్నారు. వారు తమతమ రంగాల్లో సక్సెస్ ఫుల్ గా దూసుకు పోతున్నారు.