బిగ్ బాస్ దివి.. ఈ లుక్స్ అరాచకం

Thu Aug 11 2022 17:00:01 GMT+0530 (IST)

Bigg Boss Divi Photo Talk

ఇటీవల కాలంలో కొంతమంది నటి మణులు సినిమాలతో పెద్దగా క్రేజ్ అందుకోకపోయినప్పటికీ కూడా సోషల్ మీడియా ద్వారా వారి స్థాయిని అంతకంతకు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా గ్లామరస్ అందాలతో కొంతమంది నటీమణులు ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటూ ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు కూడా అందుకుంటున్నారు. ఇక దివి వాద్య  గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆమె ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. రీసెంట్ గా యోగా చేస్తూ అమ్మడు అవుట్ ఫిట్ డ్రెస్సులలో చాలా అందంగా దర్శనం ఇచ్చింది. ఇదివరకే ఆమె చాలా సార్లు గ్లామరస్ అందాలతో ఎంతగానో ఆకట్టుకుంది.

అయితే ఈసారి మాత్రం ఆమె ఇచ్చిన లుక్స్ కనిపించిన విధానం అరాచకం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక ఫోటోలో అయితే ఎదపై ఉన్న టాటూ కూడా అందంగా ప్రజెంట్ చేసిన దివి దానికి తోడు అందమైన చిరునవ్వును కూడా జత చేసింది.

ఆమెకు నటిగా అవకాశం వస్తే తప్పకుండా తనను తాను ప్రూవ్ చేసుకుంటుంది అని కూడా మరి కొంతమంది ఫాలోవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ నాలుగో సీజన్లో కనిపించిన దివి అందులో చివరివరకు నిలవలేక పోయినప్పటికీ కూడా తన చిరునవ్వుతో అందంతో ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ షో ద్వారానే ఆమె మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ సినిమాలో కూడా ఒక ఆఫర్ కూడా అందుకోవడం విశేషం.

అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవితో ఒక స్పెషల్ సాంగ్ లో కూడా కనిపించబోతోంది. దివి ఇటీవల మా నీళ్ల ట్యాంక్ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో వెబ్ సిరీస్ ATM కోసం ఎంపికైంది.

ప్రస్తుతం మరికొన్ని వెబ్ సిరీస్ లతోపాటు అలాగే కొన్ని చిన్న సినిమాలు కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మాత్రం ఆమె ఫోకస్ ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి సినిమా పైనే ఉంది మరి ఆ సినిమాలో దివి ఎలా కనిపిస్తుందో చూడాలి.