Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్ 6 : హోటల్‌ వర్సెస్ హోటల్‌, చంటీ కి సీక్రెట్‌ టాస్క్‌

By:  Tupaki Desk   |   28 Sep 2022 7:30 AM GMT
బిగ్‌ బాస్ 6 : హోటల్‌ వర్సెస్ హోటల్‌, చంటీ కి సీక్రెట్‌ టాస్క్‌
X
తెలుగు బిగ్‌ బాస్‌ నాల్గవ వారం మొదటి ఎపిసోడ్‌ అయిన నిన్నటి ఎపిసోడ్‌ లో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ప్రారంభం అయ్యింది. అందులో భాగంగా బిగ్ బాస్ హౌస్ రెండు హోటల్స్ గా మారింది. ఒకటి బిబి హోటల్‌ మరోటి బిబి గ్లామ్ ప్యారడైజ్ హోటల్‌.

ఈ రెండు హోటల్స్ లో ఉన్న వారు కస్టమర్స్ ని ఆకర్షించి వారికి సేవలను చేసి సాధ్యం అయినన్ని ఎక్కువ పాయింట్స్ ని దక్కించుకుని కెప్టెన్సీ పోటీదారులుగా అవ్వొచ్చు.

ఈ టాస్క్ లో భాగంగా కస్టమర్‌ లు తమకు కావాల్సిన సౌకర్యాలను డబ్బులు ఇచ్చి పొందాల్సి ఉంటుంది. వారు డబ్బులు ఇవ్వడానికి హోటల్స్ వారు కాస్త ఎక్కువగానే కష్టపడ్డారు. శ్రీ సత్య డబ్బుల కోసం అర్జున్‌ కి గోరు ముద్దలు తినిపిస్తే చాలా మంది చాలా రకాలుగా తమకు కావాల్సిన సేవలను హోటల్‌ సిబ్బందితో చేయించుకున్నారు.

ముఖ్యంగా ఆర్జే సూర్య ఏకంగా షర్ట్‌ విప్పేసి ఆరోహి తో థాయ్‌ మసాజ్‌ చేయించుకున్నాడు. వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుంది... ఏదో నడుస్తుంది అనేది ఇప్పటికే అనుమానం ఉంది. ఇద్దరి మధ్య కాస్త సీరియస్ గానే వ్యవహారం సాగుతుంది అనేందుకు ఇది సాక్ష్యం అన్నట్లుగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సీజన్ నాల్గవ వారంలో బిగ్‌ బాస్ మొదటి సీక్రెట్‌ టాస్క్ ఇవ్వడం జరిగింది. మొదటి సీక్రెట్‌ టాస్క్‌ బాధ్యతలు చలాకి చంటికి దక్కాయి. ఆయన అతిధులందరినీ బిబి హోటల్ నుండి గ్లామ్ ప్యారడైజ్ హోటల్‌కి పంపాల్సి ఉంటుంది.

అలా ఆయన చేయగలిగితే నేరుగా కెప్టెన్సీ పోటీదారుడు అవుతాడు. మొదటి రోజు సరదా సరదాగానే టాస్క్ జరిగింది. రెండవ రోజు ఎలాంటి సీన్స్ చూడాల్సి ఉంటుందో నేటి ఎపిసోడ్ టెలికాస్ట్‌ అయ్యే వరకు వెయిట్‌ చేయాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.