Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ 5 : ఆరవ ఔట్‌ ఈ ఇద్దరిలో ఒకరేనా?

By:  Tupaki Desk   |   14 Oct 2021 5:33 AM GMT
బిగ్‌ బాస్‌ 5 : ఆరవ ఔట్‌ ఈ ఇద్దరిలో ఒకరేనా?
X
తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 5 అయిదు వారాలు పూర్తి చేసుకుని ఆరవ వారంలోకి అడుగు పెట్టింది. ఆరవ వారంలో ఏకంగా పది మంది ఎలిమినేషన్ కు నామినేట్ అయిన విషయం తెల్సిందే. ఇప్పటి వరకు సరయు.. ఉమా.. లహరి.. నటరాజ్‌.. హమీదాలు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం ఎలిమినేషన్ కు నామినేట్‌ అయిన వారిలో వీక్ కంటెస్టెంట్స్ గా శ్వేత.. విశ్వ మరియు జెస్సీలు ఉన్నారు. అయితే జెస్సీకి షణ్ను బ్యాచ్‌ గట్టిగా సపోర్ట్‌ లభిస్తుందనే టాక్ ఉంది. కనుక జెస్సీ ఖచ్చితంగా ఉంటాడు అనేది అందరి నమ్మకం. బిగ్ బాస్ నుండి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది విశ్వ లేదా శ్వేత అనే టాక్ బలంగా వినిపిస్తుంది.

శ్వేత మూడ్‌ స్వింగ్స్ మరియు ఆమె ప్రవర్తన కొన్ని సార్లు విడ్డూరంగా విచిత్రంగా అనిపిస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక విశ్వ పదే పదే ఎమోషనల్‌ అవుతూ ఉన్నాడు. టాస్క్ ల పరంగా అతడు స్ట్రాంగ్‌ అయినా కూడా మెంటల్ గా అతడు వీక్ అనే అభిప్రాయంలో ప్రేక్షకులు ఉన్నారు. అందుకే ఆయనకు ఏ మేరకు ఓట్లు పడుతున్నాయి అనేది అనుమానంగా ఉంది. మా వర్గాల ద్వారా అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం శ్వేత మరియు విశ్వలు మాత్రమే ఓట్లు దక్కించుకోవడంలో వెనుకబడి ఉన్నారు. ఇద్దరు కూడా కొద్ది తేడాతోనే ఉండే అవకాశం ఉంది. శుక్రవారం రాత్రి సమయంకు ఎవరి ఓట్లు ఎన్ని అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.

ఇద్దరిలో ఒకరు ఔట్ అవ్వడం మాత్రం పక్క. నామినేట్‌ అయిన వారిలో ప్రతి ఒక్కరికి కూడా వారి వారి ఫ్యాన్ బేస్ ఉంది. కాని వీరిద్దరి ఫ్యాన్‌ బేస్ మాత్రం చాలా తక్కువ ఉంది అనేది చాలా మంది టాక్‌. బుల్లి తెర వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం గ్లామర్‌ కోసం చూస్తే శ్వేతను ఉంచి విశ్వను ఎలిమినేట్ చేసే అవకాశాలు కూడా లేక పోలేదు అంటూ టాక్ వినిపిస్తుంది. మొత్తానికి ఆరవ వికెట్‌ గా వీరిద్దరిలో ఎవరు పడబోతున్నారు అనేది చూడాలి. వారాలు గడుస్తున్నా కొద్ది చాలా ఇంట్రెస్టింగ్‌ గా ఎలిమినేషన్‌ పక్రియ సాగుతుంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు షాక్ అయ్యేంతగా మాత్రం కంటెస్టెంట్స్ ఎలిమినేట్‌ అవ్వలేదు. మొదటి నుండి కూడా వీక్ కంటెస్టెంట్స్.. జనాలు ఊహించిన వారు మాత్రమే ఎలిమినేట్‌ అవుతూ వస్తున్నారు. ఈసారి కూడా విశ్వ మరియు శ్వేతల్లో ఒకరు ఎలిమినేట్‌ అవ్వడం ఖాయం.