బిగ్ బాస్ 5 లీక్ : స్పెషల్ కంటెస్టెంట్ ఎలిమినేట్

Sat Dec 04 2021 22:18:36 GMT+0530 (IST)

Bigg Boss 5 Leak Special Contestant Eliminate

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు వచ్చేసింది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే సస్పెన్స్ ఎక్కువ ఏమీ లేదు. ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అవ్వబోతుంది అంటూ అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఆమె బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యింది అంటూ లీక్ వస్తుంది.గత వారంలోనే బిగ్ బాస్ నుండి ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అవుతుందని అంతా నమ్మారు. కాని అనూహ్యంగా రవి అభిమానుల అతి నమ్మకమో లేదా మరేంటో కాని ప్రియాంక సింగ్ ఉండగా యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడు. ఆయన ఎలిమినేషన్ తో అంతా కూడా నోరు వెళ్లబెడుతున్నారు.

బిగ్ బాస్ నుండి గత వారమే ఎలిమినేట్ అవ్వాల్సిన ప్రియాంక సింగ్ అదృష్టం కలిసి రావడంతో ఒక వారం కొనసాగింది అంటూ కొందరు విశ్లేషకులు అంటున్నారు. నేడు వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయ్యింది అంటూ లీక్ అందింది. ఆదివారం ఎపిసోడ్ లో ప్రియాంక ఎలిమినేట్ అయినట్లుగా ప్రకటించబోతున్నారు. కాని ఎప్పటిలాగే ముందే లీక్ అయితే అందింది. గత వారం కూడా ముందు రోజే యాంకర్ రవి ఎలిమినేట్ అయినట్లుగా లీక్ వచ్చింది. దాన్ని చాలా మంది నమ్మలేదు. కాని ప్రియాంక ఎలిమినేట్ అయినట్లుగా ఈ వారం వస్తున్న లీక్ ను నూటికి నూరు శాతం నమ్మవచ్చు అనడంలో సందేహం లేదు.

బిగ్ బాస్ సీజన్ 5 లో స్పెషల్ కంటెస్టెంట్ గా పింకీ అలియాస్ ప్రియాంక సింగ్ ఎంట్రీ ఇచ్చింది. ట్రాన్స్ జెండర్ గా హౌస్ లో అడుగు పెట్టిన ప్రియాంక సింగ్ కు మొదటి నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. గేమ్ విషయంలో ఆమె ఎప్పుడు అగ్రసివ్ గా లేకున్నా కూడా ఉన్నంతలో కూల్ గా ఉంటూ.. మానస్ తో స్నేహంగా ఉంటూ వచ్చింది.

ఇంటి సభ్యులకు వంట చేసి పెట్టడంతో పాటు ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉండటం ట్రాన్స్ జెండర్ అంటే ఉన్న అభిప్రాయంను మార్చే విధంగా ప్రియాంక సింగ్ వ్యవహరించింది. గత సీజన్ లో వచ్చిన తమన్నా సింహాద్రి తో పోల్చితే ప్రియాకం సింగ్ వందల రెట్లు బెటర్ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వచ్చింది. అందుకే పింకీ ఇన్ని వారాలు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగింది. ఇన్ని వారాలు ఆమె కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. ఆమెకు ఇది గొప్ప విజయం అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.