Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 4 ప్రోమో.. 'గోపి' ఏంటా ట్విస్టు?

By:  Tupaki Desk   |   13 Aug 2020 6:16 AM GMT
బిగ్ బాస్ 4 ప్రోమో.. గోపి ఏంటా ట్విస్టు?
X
ప్ర‌తిసారీ బిగ్ బాస్ సీజ‌న్ లో ఏదో ఒక కొత్త‌ద‌నం ఉండాల్సిందే. అలా లేక‌పోతే ప్రేక్ష‌కులు బోర్ ఫీల‌వుతారు. అందుకేనేమో ఈసారి ఏకంగా హోస్ట్ నాగార్జున గెట‌ప్ నే మార్చేశారు. తాజాగా రిలీజైన ప్రోమోలో గోపీ .. అంటూ ఆయ‌న కొత్త వేషం.. కులుకులు చూస్తుంటే ఇంకేదో స‌స్పెన్స్ ఎలిమెంట్ ని ఈసారి సీజ‌న్ కి జ‌త చేశారా? అన్న డౌట్ పుట్టుకొస్తోంది.

నాలుగో సీజ‌న్ హోస్ట్ గా నాగార్జునను ఖాయం చేసుకుని స్టార్ మా తెలివైన ప‌నే చేసింది కానీ.. ఇంత‌కుముందు సీజ‌న్ కంటే ఇప్పుడు కొత్త‌గా ఏం చూపిస్తారు? అన్న‌దే టీఆర్పీకి ఆయువు ప‌ట్టు అవుతుంది. అలా కాకుండా పాత చింత‌కాయ విధానంలోనే పార్టిసిపెంట్లు ఇంట్లో ఆట‌లాడితే ఎవ‌రూ ప‌ట్టించుకోరు. రొటీన్ గా లాజిక్ లేని చెత్త గేమ్స్ ఎవ‌రూ చూడ‌రు. టైమ్ వేస్ట్ చేయ‌డానికి యంగేజ్ చేయ‌డానికి ఈసారి కుద‌ర‌దు. అస‌లే బుల్లితెర ఆడియెన్ మునుప‌టితో పోలిస్తే క‌సిగా ఉండే కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మ‌హ‌మ్మారీ క్వారంటైన్ లో అన‌వ‌స‌రంగా టైమ్ వేస్టు చేసుకునే ఆలోచ‌న‌తో లేరు.

ఇక ఈ మార్పుల‌న్నీ గ‌మ‌నించిన స్టార్ మా వాళ్లు ఈసారి షోలో స్పైసీ కంటెంట్ ని ఇంప్లిమెంట్ చేశార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అందుకే వేడెక్కించే పాపుల‌ర్ టీవీ యాంక‌ర్లు.. అగ్గి రాజేసే వ‌య్యారం ఉన్న‌ క‌థానాయిక‌ల‌తో కొత్త సీజ‌న్ ని అరిపించే ప్లాన్ చేశార‌ట‌. తొలి మూడు సీజ‌న్ల కంటే ఈసారి కొత్తేంటి అన్న‌దే న‌డిపిస్తుంది. అన్న‌ట్టు తాజా ప్రోమోలో అసలు గోపీ ఎవరు? ఈసారి బిగ్‌బాస్ ప‌రిచ‌యం చేయ‌బోతున్న‌ ఈ కొత్త క్యారెక్టర్‌ ఎవరు? అన్న‌ది ఆస‌క్తిని పెంచుతోంది. సీజ‌న్ 3లో కోతి బొమ్మ‌ను ఆశ్ర‌యించిన నాగార్జున ఈసారి పండుటెంట్రుక‌ల‌తో వృద్ధ గెట‌ప్ లో ప్రోమోలో క‌నిపించారు. అస‌లేంటి ఈ ట్విస్టు? మ‌రి ఈ కొత్త‌ గెట‌ప్ ఎవ‌రిది? గోపి ఎవ‌రు? అన్న‌ది ఇప్ప‌టికైతే సస్పెన్స్ . బిగ్ బాస్ 4 త్వ‌ర‌లో ప్రారంభం కానుంది.