Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ ఫన్నీ టాస్క్: లేడీస్ జీకేలో వీక్‌..

By:  Tupaki Desk   |   21 Sep 2019 4:42 AM GMT
బిగ్ బాస్ ఫన్నీ టాస్క్: లేడీస్ జీకేలో వీక్‌..
X
బిగ్ బాస్ షో ఎపిసోడ్లు గడిచే కొద్దీ మరింత ఆసక్తికరంగా సాగుతుంది. రోజుకో కొత్త టాస్క్ ఇస్తూ...ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నారు. శుక్రవారం ఎపిసోడ్ కూడా బాగా సరదాగా సాగింది. మొదట లాటరీ ద్వారా కంటెస్టంట్స్ కు సంబంధించిన ఇద్దరు రిలేటివ్స్ ని సెలక్ట్ చేసి హౌస్ లోకి పంపారు. లాటరీ ద్వారా సెలక్ట్ అయిన వితికా అన్నయ్య - రవి..మేనమామ కన్ఫెషన్ రూమ్ లో వారిని కలిశారు. అయితే 10 మందిని తీసుకొచ్చి ఇద్దరికి మాత్రమే అవకాశం ఇవ్వడం... శ్రీముఖి - శివజ్యోతి వారి రిలేటివ్స్ రాకపోవడంతో బాగా ఎమోషనల్ అయ్యారు.

ఇక ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు సరదా టాస్క్ ఇచ్చారు. ఇంట్లోని మగ - ఆడ సభ్యులని రెండు గ్రూపులుగా విభజించి గేమ్ ఆడించాడు. అందులో మొదటిగా మగవాళ్ళు వారికి వారే ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకోవాలని సూచించారు. కానీ బాబా భాస్కర్ - రాహుల్ ఎమోషనల్ కాకపోవడంతో...ఈ టాస్క్ లో వీరు ఫెయిల్ అయ్యారు. నెక్స్ట్ ఆడవాళ్ళు పది నిమిషాల్లో రెడీ అవ్వాలని చెప్పారు. దీంతో వారు సమయానికి తగ్గట్టుగా రెడీ అయ్యారు.

ఇక వారిని చూసి బాబా భాస్కర్ సరదాగా అందాన్ని వర్ణించే ప్రయత్నం చేశారు. అయితే పది నిమిషాల సమయంలో బాగానే రెడీ అయ్యారని మగ సభ్యులు చెప్పడంతో...ఈ టాస్క్ లో లేడీస్ విన్ అయ్యారు.మూడో లెవెల్ లో భాగంగా మగ సభ్యులు బెడ్ రూముని చక్కగా సర్ది...కిచెన్ లో ఐదు ఆమ్లెట్లు వేయాలని చెప్పారు. దీంతో వారు బెడ్ రూముని నీటుగా సర్దేసి..ఆమ్లెట్స్ వేయడంతో...టాస్క్ లో గెలిచారని లేడీస్ ప్రకటించారు.

చివరిగా మహిళలు జనరల్ నాలెడ్జ్ లో వీక్ అనే అంశాన్ని కొట్టిపారేయడానికి వారికి జీకేలో పది ప్రశ్నలు ఇచ్చారు. అందులో ఆరు కరెక్ట్ గా సమాధానం చెబితే వారు విన్ అయినట్లే..కానీ వారు ఆరు సమాధానాలు చెప్పలేకపోవడంతో... ఆడవారు జీకే లో వీక్ అని నిరూపించేలా చేశారు.