Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌: ఆ ఇద్ద‌రి స‌ర‌సాలు..ఫీల్ ద ఫిజ్ విన్న‌ర్‌ గా అలీ

By:  Tupaki Desk   |   13 Oct 2019 4:33 AM GMT
బిగ్‌ బాస్‌: ఆ ఇద్ద‌రి స‌ర‌సాలు..ఫీల్ ద ఫిజ్ విన్న‌ర్‌ గా అలీ
X
ఎప్పటిలాగానే బిగ్ బాస్ స్టేజ్ మీదకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన కింగ్ నాగార్జున...శుక్రవారం ఎపిసోడ్ లో ఇంటి సభ్యులు చేసిన సందడిని మన టీవీ ద్వారా చూపించారు. ఎపిసోడ్ ప్రారంభమే రాహుల్ ఓ కష్టపడుతూ జిమ్ లో వర్కౌట్స్ చేయగా - అతని మీద వితికా - మహేష్ సెటైర్లు వేసుకున్నారు. అటు శివజ్యోతి - అలీలు రోజులాగానే గిల్లికజ్జాలు ఆడుకున్నారు. శివజ్యోతిని నిద్రపోనివ్వకుండా అలీ ఒక ఆట ఆడుకున్నాడు. ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న వరుణ్ - మహేష్ - రాహుల్ నేను వెళ్లిపోతా అంటే నేను వెళ్లిపోతాని చర్చ పెట్టుకున్నారు.

వీరి ముచ్చట్లు తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లో నుంచి ముగ్గురుని సెలెక్ట్ చేయాలని - వారు యాపీ ఫిజ్ వారి ఫీల్ ది ఫిజ్ టాస్క్ ఆడాలని సూచించారు. దీంతో బాబా భాస్కర్ - వరుణ్ - అలీలు టాస్క్ ఆడారు. టాస్క్ ప్రకారం స్విమ్మింగ్ పూల్ లో ఉన్న యాపీ ఫిజ్ చిన్న డ్రింక్ బాటిల్స్ ని ఒక్కొకటి పైకి తెచ్చుకుని తాగాలని టాస్క్ మొదలుపెట్టారు. అయితే ఎండ్ బజర్ మ్రోగేసరికి ముగ్గురు 12 డ్రింక్స్ తాగి సమానంగా ఉన్నారు. దీంతో మరోసారి టాస్క్ పెట్టగా - అప్పుడు అలీ విజేతగా నిలిచాడు. దీంతో అలీ యాపీ ఫిజ్ డ్రింక్ తాగుతున్న పోస్టరుని అతనికి కానుకగా ఇచ్చారు.

ఇక రాత్రి సమయంలో స్విమ్మింగ్ పూల్ ఏరియా దగ్గర వరుణ్-వితికా సరసాలాటలోకి దిగారు. వితికా కావాలనే వరుణ్ ని పైకి ఎత్తుకుంటూ స్విమ్మింగ్ పూల్ లో పడేయాలని చూసింది. కానీ వితికా ఎన్నిసార్లు ప్రయత్నించినా వరుణ్‌ ని ఎత్తుకోలేకపోవడంతో ముంగమూతి పెట్టి లోపలికి వెళ్లిపోయింది. లోపలికి వెళ్లిన తరువాత ఇద్దరూ కలిసి భోజనం చేస్తుండగా వరుణ్ ఎలిమినేషన్ గురించి మాట్లాడాడు.

ఈ వారం నేను ఎలిమినేట్ అయితే జాగ్రత్త వితికా’ అంటూ వరుణ్ ఏదో ఫీలింగ్ లో చెప్పాడు. వరుణ్ ఫీల్ అవుతూ చెప్పడంపై వితికా సీరియస్ అయింది. ఉంటే ఉంటాం వెళ్తే వెళ్తాం.. ఇలా మాట్లాడి నాకు కోపం తెప్పించకూ - నువ్ వెళ్లినా నేను బాగానే ఉంటా..అంటూ ఓ ఫైర్ అయిపోయింది. దీంతో వరుణ్ సైలెంట్ గా చూస్తుండిపోయాడు.