`మా` ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్

Thu Sep 23 2021 22:00:01 GMT+0530 (IST)

Big twist on MAA election

మా` ఎన్నికల సమరం రోజుకో మలుపు తిరుగుతోంది.  ఎన్నికల తేదీ తగ్గర పడుతున్నా కొద్దీ సినిమాలో ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ల తరహాలో రసవత్తర మలుపు తిరుగుతోంది.  ఈ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీపడుతున్న అభ్యుర్థులైన ప్రకాష్ రాజ్.. హీరో మంచు విష్ణు రహస్య విందులకు తెరలేపుతున్నారు. గ్రూపు రాజకీయాలతో `మా` ఎన్నికల సమరాన్ని రాజకీయ ఎన్నికల సమరంగా మారుస్తున్నారు.ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ ని ప్రకటించి తనతో కలిసి వచ్చే వారికి ప్రత్యేకంగా విందుని ఏర్పాటు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై బండ్ల గణేష్ ఘాటు విమర్శలు గుప్పించాడు. తాజాగా మంచు విష్ణు కూడా ఇగదే తరహా సీక్రెట్ విందుని ఏర్పాటు చేయడంతో `మా` ఎన్నికల సమరం గ్రూప్ రాజకీయాలు.. సీక్రెట్ విందులుగా మారి వార్తల్లో నిలుస్తోంది.

ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ అభ్యర్థులు ఒకరిపై ఒకరు మీడియా ముఖంగా విమర్శలకు దిగుతున్నారు. అక్టోబర్ 10న `మా` ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఊహించని ట్విస్ట్. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి పోటీపడుతున్న జీవితా రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలంటూ నటుడు పృథ్వీ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.

ప్రస్తుతం `మా` సెక్రటరీగా పనిచేస్తున్న జీవిత ఆ పదవిని అడ్డుపెట్టుకుని `మా` కార్యాలయాన్ని ఎన్నికల క్యాపెయిన్ కి వాడుకుంటోందని.. తనకు ఓటేస్తే తాత్కాలిక సభ్యత్వాలు ఇస్తాని ఓటర్లని మభ్యపెడుతోందని తనకు ఓటేస్తే ఇలాంటివి చాలా లాభాలు వుంటాయని చెబుతూ ప్రచారం చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని.. అమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నటుడు పృథ్వీ ఎన్నికల అధికారిక రాసిన లేఖలో పేర్కొనడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజా వివాదంపై జీవిత ఎలా స్పందిస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు.