పెద్ద బ్యానర్ తో రిలేషన్ కోసమే పెద్ద రేటు?

Sun Jun 06 2021 11:00:01 GMT+0530 (IST)

Big rate for a relationship with a big banner?

అగ్ర హీరోలతో సత్సంబంధాల కోసం అగ్ర బ్యానర్లతో రిలేషన్ షిప్ కోసం కొన్నిటిని వదులుకోవాల్సి ఉంటుంది. అయితే అమెజాన్ ప్రైమ్ .. నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు ఈ తరహా రిలేషన్ షిప్ కోసం ఒరిజినల్ ప్రైజ్ కంటే కాస్త పెద్ద మొత్తాన్ని సినిమాలపై పెట్టుబడిగా పెడుతున్నాయట. సినిమాకి ఉన్న క్రేజు కంటే బ్యానర్ విలువను బట్టి కూడా అదనంగా డబ్బు విసిరేస్తున్నారనేది తాజా గుసగుస. అది బ్యానర్ ని బట్టి దానివెనక ఉన్న పెద్ద హ్యాండ్స్ ని బట్టి మాత్రమే.అదే కోవలో ఇటీవలే ఓ యువహీరో వెనక పెద్ద బ్యానర్ ని చూసి అమెజాన్ ప్రైమ్ వాళ్లు కొనుక్కున్నారని కథనాలొస్తున్నాయి. నిజానికి నవతరం హీరో క్రేజు అంతంత మాత్రమే. అతడు నటించిన ఆరంభ సినిమాలు ఫ్లాప్ లు. అయితే పెద్ద బ్యానర్ ఆ బ్యానర్ వెనక ఉన్న అగ్ర హీరోని చూసి ఈ యువహీరో సినిమాని పెద్ద ధరకు ప్రైమ్ వాళ్లు కొన్నారంటూ ప్రచారం సాగుతోంది.

అయితే ఆ సినిమా సదరు ఓటీటీలో పెద్ద హిట్టయ్యింది. హీరోకి ప్రశంసలు దక్కాయి. కాన్సెప్ట్ కంటెంట్ బాగా ఎక్కింది. ఒక వైవిధ్యమైన ఎటెంప్ట్ అంటూ క్రిటిక్స్ సహా కామన్ ఆడియెన్ పొగిడేశారు. దీంతో ఆ హీరోకి కూడా అది కలిసొస్తోంది. ప్రస్తుతం అతడు వరుస సినిమాలకు కమిటవుతున్నాడట. అయితే అతడికి ఆఫర్లు వెల్లువెత్తుతుంటే మరో రకం ప్రచారం తెరపైకొచ్చింది. సక్సెస్ సాధించిన హీరోతో సినిమా చేస్తున్నాం అన్న మిషతో ల్యాబుల్లో ఉన్నవాటిని బయటికి వదిలేందుకు కొందరు నిర్మాతలు ఎత్తుగడలు వేస్తున్నారట. దీంతో చాలా కథలు ఆ యువహీరో వైపు వస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. సరైన రిలీజ్ లు దొరక్క ల్యాబుల్లో ఉన్నవాటిని రిలీజ్ చేసేందుకు అతడితో సినిమా ప్లాన్ కలిసొస్తుందని సదరు బ్యానర్లు విశ్వసిస్తున్నాయట. ఇదోరకం స్ట్రాటజీ!! అంటూ సన్నాయి నొక్కులు వినిపిస్తున్నాయి.

పైగా ఆ యువహీరో కంటే బెటర్ ఆప్షన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న కథలు ఇప్పడు ఇటు మళ్లి తెర మీదకి వస్తున్నాయట. ఏదో ఒక రకంగా అతడి దశ తిరిగిందన్నది నిజం. అతడికి నిరూపించుకునేందుకు మంచి అవకాశం దొరికినట్టే. ఇతర హీరోల లాస్ అతడికి గెయిన్ అని కూడా అనుకోవచ్చు.