Begin typing your search above and press return to search.

మొదటి దెబ్బ జాన్వీ కపూర్‌ సినిమాకే పడినది

By:  Tupaki Desk   |   13 Aug 2020 4:15 AM GMT
మొదటి దెబ్బ జాన్వీ కపూర్‌ సినిమాకే పడినది
X
సినిమాల్లో సీరియల్స్‌ లో వెబ్‌ సిరీస్‌ లో మరియు డాక్యుమెంటరీల్లో ఇండియన్‌ ఆర్మీతో పాటు పోలీసులపై నేవీ మరియు ఎయిర్‌ ఫోర్స్‌ గురించి సినిమాలు తీసినప్పుడు లేదంటే వాటికి సంబంధించి ఏవైనా సీన్స్‌ ఉన్నప్పుడు ఖచ్చితంగా నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ ను తీసుకోవాల్సిందే అంటూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. కేంద్రం నిర్ణయంతో ఇకపై ప్రతి సినిమా కూడా ఆయా రంగాల నుండి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ ను తెచ్చుకోవాల్సి ఉంటుంది. తాజాగా జాన్వీ కపూర్‌ నటించిన గుంజన్‌ సక్సెనా చిత్రం ఎయిర్‌ ఫోర్స్‌ నేపథ్యంలో అవ్వడంతో మొదటి దెబ్బ ఈ సినిమాకే తగిలింది.

కార్గిల్‌ యుద్దం సమయంలో గుంజన్‌ సక్సెనా చూపించిన ప్రతిభ పాఠవాలు మరియు అద్బుతమైన నైపుణ్యంను తమ సినిమాలో చూపిస్తామంటూ గుంజన్‌ సక్సెనా ది కార్గిల్‌ గర్ల్‌ సినిమాను తెరకెక్కించిన ధర్మ ప్రొడక్షన్స్‌ వారు సినిమాలో ఇండియన్‌ ఎయిర్‌ ఫోన్స్‌ ను అవమానించేలా కొన్ని డైలాగ్స్‌ ను పెట్టారంటూ తాజాగా విడుదలైన ట్రైలర్‌ తో వెళ్లడయ్యింది. పలువురు ఆ ట్రైలర్‌ పై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఎయిర్‌ ఫోర్స్‌ ఉన్నతాధికారులు కూడా ట్రైలర్‌ చూసిన తర్వాత చిత్ర నిర్మాణ సంస్థతో పాటు నెట్‌ ఫ్లిక్స్‌ కు లేఖ రాసింది. దీంతో ఈ సినిమా విడుదల విషయంలో నీలి నీడలు కమ్ముకున్నాయి.