Begin typing your search above and press return to search.

40 వ‌య‌సులో భూమిక ఫిట్ నెస్ సీక్రెట్

By:  Tupaki Desk   |   8 Aug 2020 4:45 AM GMT
40 వ‌య‌సులో భూమిక ఫిట్ నెస్ సీక్రెట్
X
లేట్ ఏజ్ లోనూ ఫిట్ గా ఉండ‌డం అన్న‌ది కొంద‌రు క‌థానాయిక‌లకే చెల్లింది. ఈ జాబితాలో సుస్మితా సేన్.. మ‌లైకా అరోరా ఖాన్ .. ఐశ్వ‌ర్యారాయ్.. క‌రీనా క‌పూర్.. క‌రిష్మా క‌పూర్.. రాశీ.. ఇంద్ర‌జ‌.. రోహిణి.. ఇలా కొంద‌రే ఉన్నారు. వీళ్లంతా న‌ల‌భైకి అటూ ఇటూగానే ఉన్నారు. ట‌బు - న‌దియా లాంటి సీనియ‌ర్లు యాభైకి చేరువ‌లో ఉన్న ఫిట్నెస్ స్టార్స్. వీళ్లంతా ప‌ర్ఫెక్ట్ ఫిట్ బాడీతో యూత్ ని ప‌రేషాన్ చేస్తున్నారు.

ఇప్పుడు ఈ జాబితాలోకి చేరిపోయింది భూమిక చావ్లా. ఈ భామ తొలినుంచి ఫిట్ నెస్ ఫ్రీక్ అన్న సంగ‌తి తెలిసిందే. భ‌ర్త భ‌ర‌త్ ఠాకూర్ గొప్ప యోగా గురువు. ఫిట్ నెస్ ట్రైన‌ర్ గా ఆయ‌నకు అరుదైన రికార్డ్ ఉంది. హైద‌రాబాద్ ఇనిస్టిట్యూట్ లో భూమిక ఠాకూర్ ల‌తో క‌లిసి అనుష్క లాంటి అందాల భామ యోగాభ్యాసం చేయ‌డం తెలిసిన‌దే.

భూమిక ఇటీవ‌ల న‌ట‌న‌లో రీఎంట్రీ ఇచ్చినా అంతంత మాత్రంగానే తెర‌పై క‌నిపిస్తోంది. ఇక నిరంత‌రం యోగా వ్యాయామాన్ని మాత్రం విడిచిపెట్టిన‌ట్టు లేదు. ప్ర‌స్తుత స్వీయ‌నిర్భంధంలో భూమిక ఏం చేస్తోందో తెలుసా? ఇదిగో ఈ వీడియో చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది. భూమికా చావ్లా తన అద్భుతమైన ఫిట్నెస్ విన్యాసాన్ని ఇదిగో ఇలా ప్ర‌ద‌ర్శిస్తోంది. ఒక ఉద్యానవనంలో గాలిలో వేలాడుతున్న ఒక తాడును ప‌ట్టుకుని పైపైకి ఎగ‌బాకుతోంది. ఆర్మీ ట్రైనింగ్ త‌ర‌హాలో ఇది కాస్త క‌ఠిన‌మైన‌దే. 40 వ‌య‌సులో ఈ ఫీట్ వేయాలంటే చాలా ఎన‌ర్జీ కావాలి. కానీ భూమిక ప‌ర్ఫెక్ట్ ఫిట్ అని అర్థ‌మ‌వుతోంది.

2007 లో యోగా ట్రైనర్ భరత్ ఠాకూర్ ‌ను భూమిక‌ వివాహం చేసుకుంది. ఆరేళ్ల వ‌య‌సున్న బాలుడికి త‌ను తల్లి. ఆమె చివరిసారిగా బాలయ్య సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. తదుపరి విడుదల గోపిచంద్ - తమన్నా జంట‌గా న‌టిస్తున్న సీటీమార్ చిత్రంలోనూ ఓ కీల‌క పాత్రను పోషిస్తోంది.