Begin typing your search above and press return to search.

డే-1 యంగ్ హీరో దుమారం..RRR రికార్డు చెల్లాచెదురు!

By:  Tupaki Desk   |   21 May 2022 9:30 AM GMT
డే-1 యంగ్ హీరో దుమారం..RRR రికార్డు చెల్లాచెదురు!
X
కోవిడ్ ప్రారంభం ద‌గ్గ‌ర నుంచి బాలీవుడ్ కి స‌రైన స‌క్సెస్ ప‌డలేదు. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రైన ఫ‌లితాలు సాధించ‌డ‌కుండానే నిష్ర్క‌మిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ప‌రిశ్ర‌మ స‌క్స‌స్ ట్రాక్ లో ప‌డుతుంది. `గుంగుభాయ్ క‌తియావాడి`..`ది క‌శ్మీర్ ఫైల్స్` లాంటి సినిమాలు పెద్ద విజ‌యాలు న‌మోదు చేయ‌డంతో కాస్త కొలుకుంది.

అయితే ఫ‌స్ట్ డే వ‌సూళ్లు మాత్రం ఈ సినిమాలేవి ఆశాజ‌న‌కంగా లేవ‌నే చెప్పాలి. ఈ సినిమాల‌కి పాజిటివ్ టాక్ వ‌చ్చిన త‌ర్వాత‌నే రెండ‌వ రోజు నుంచి పుంజుకున్నాయి త‌ప్ప ఓపెనింగ్స్ రూపంలో ఈ రెండు చిత్రాలు కూడా స‌రైన ఫ‌లితాలు సాధించ‌లేద‌ని తెలుస్తుంది. అక్షయ్ కుమార్..టైగ‌ర్ ష్రాప్ లాంటి న‌టుల సినిమాలు సైతం ఓపెనింగ్స్ లో విఫ‌ల‌మ‌వ్వ‌డం బాలీవుడ్ ని మ‌రింత నిరాశ‌లోకి నెట్టింది.

అయితే ఇప్పుడా లెక్క‌ల‌న్నింటిని యంగ్ హీరో కార్తిక్ ఆర్య‌న్ స‌రిచేస్తాడా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తుంది. ట‌బు.. కార్తీక్ ఆర్య‌న్.. కియారా అద్వాణీ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన `భూల్ బుల‌య్యా- 2` శుక్ర‌వారం రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తొలి రోజు మంచి వ‌సూళ్లు సాధించింద‌ని తెలుస్తోంది. ఏకంగా పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయిన `ఆర్ ఆర్ ఆర్` మొద‌టి రోజు వ‌సూళ్లు ఈ సినిమా బ్రేక్ చేసింద‌ని తెలుస్తోంది.

`భూల్ బుల‌య్యా-2` ఒక్క మ‌ల్టీప్లెక్స్ చెయిన్ నుండే 7.5 కోట్ల వ‌సూళ్ల‌ని సాధించింది. 7.5 కోట్ల వ‌సూళ్ల‌ని డే -1 ఆర్ ఆర్ ఆర్ వ‌సూళ్ల‌తో స‌మానం అని చెప్పాలి. `ఆర్ ఆర్ ఆర్` మొద‌టి రోజు 8.25 కోట్లు వ‌సూళ్లు సాధించింది. కానీ పెరిగిన టిక్కెట్ ధ‌ర‌ల ప్ర‌కారం `ఆర్ ఆర్ ఆర్` ఆ స్థాయి వ‌సూళ్ల‌ని సాధించింది. కానీ భూల్ బెఉల‌య్యా-2 మాత్రం పాత‌ ధ‌ర‌ల ప్ర‌కార‌మే రిలీజ్ అయి 7.5 కోట్ల వ‌సూళ్ల‌ని సాధించింది.

ఆ లెక్క‌న రెండు సినిమాల వ‌సూళ్ల‌ని స‌రిపొల్చితే `భూల్ బుల‌య్యా-2` వ‌సూళ్లు రికార్డు అనే చెప్పాలి. దీంతో ట్రేడ్ పండితులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఏ హిందీ సినిమా ఈ స్థాయిలో ఓపెనింగ్ డే వ‌సూళ్ల‌ని సాధించ‌లేదు. సినిమాకి టాక్ పాజిటివ్ గానే ఉంది. దీంతో `భూల్ బుల‌య్యా-2` వ‌సూళ్లు ఇంకా మెరుగ్గా ఉంటాయ‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తుంది. బాలీవుడ్ ఈ సినిమాతో రీచార్జ్ అవుతుందంటూ విమ‌ర్శ‌కులు ప్ర‌శంసిస్తున్నారు. ఈ చిత్రానికి అనీస్ బాజ్మీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.