Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌ పరువు ఆ దెయ్యం పై...!

By:  Tupaki Desk   |   17 May 2022 4:50 PM GMT
బాలీవుడ్‌ పరువు ఆ దెయ్యం పై...!
X
2022 సంవత్సరం దాదాపు గా సగం పూర్తి అవ్వడానికి వచ్చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సౌత్ నుండి పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. కేవలం సౌత్‌ లోనే కాకుండా బాలీవుడ్‌ లో కూడా బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్స్ గా కూడా నిలిచాయి. సౌత్ సినిమాల్లో కొన్ని బాలీవుడ్‌ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసి వందల కోట్ల వసూళ్లను కూడా అక్కడ దక్కించుకున్నాయి.

కేజీఎఫ్‌ 2 సినిమా బాలీవుడ్‌ బిగ్గెస్ట్ మూవీ దంగల్‌ రికార్డును సైతం బ్రేక్‌ చేసి సంచలనం సృష్టించింది. ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా కూడా హిందీ వర్షన్‌ భారీగానే వసూళ్లను దక్కించుకుంది. సౌత్‌ సినిమాలు ఉత్తర భారతంలో కుమ్మేస్తున్నాయి కాని బాలీవుడ్‌ సినిమాలు మాత్రం ఇప్పటి వరకు పెద్దగా విజయాలను దక్కించుకున్న దాఖలాలు లేవు.

హిందీలో ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా చాలా సినిమాలు రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క హిందీ సినిమా కూడా సాలిడ్ సక్సెస్ ను దక్కించుకోలేక పోయింది. సూపర్‌ స్టార్‌.. పెద్ద స్టార్‌ అంటూ పేరున్న పలువురు బాలీవుడ్‌ పెద్ద హీరోల సినిమాలు కూడా బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.

ఇప్పుడు బాలీవుడ్‌ దృష్టి అంతా కూడా దెయ్యం సినిమా భూల్‌ భులయ్య 2 పై ఉంది. బాలీవుడ్‌ చంద్రముఖి సినిమాకు ఇది సీక్వెల్ అన్నట్లుగా రూపొందినట్లుగా బాలీవుడ్ వర్గాల వారి ద్వారా సమాచారం అందుతోంది. కాస్త కొత్తదనంతో కూడిన కథ ఖచ్చితంగా మంచి ఎంటర్ టైన్మెంట్‌ ను ఈ సినిమా అందిస్తుందనే నమ్మకంను బాలీవుడ్ మీడియా వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్‌ లో ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక భారీ విజయం పడిందే లేదు. కనుక ఈ సినిమా అయినా సక్సెస్ అయ్యి బాలీవుడ్ పేరు మరియు పరువు నిలుపుతుందేమో చూడాలి. ఈ సినిమా లో హీరోగా కార్తీక్ ఆర్యన్ నటించగా హీరోయిన్ గా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. టబు మరియు పరేష్ రావల్ లు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈనెల 20వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమాకు పాజిటివ్‌ బజ్ అయితే ఉంది. మరి ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడాలి.