స్టైలిష్ ఫైట్ కంప్లీట్ చేసిన 'భోళా శంకర్'

Wed Dec 08 2021 15:20:03 GMT+0530 (IST)

Bhola Shankar  Completed Stylish Fight


మెగాస్టార్ చిరంజీవి గతంతో పోలిస్తే స్పీడు పెంచేశారు. వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో రఫ్పాడించేస్తున్నారు. ఓ పక్క స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్న `ఆచార్య` చిత్రాన్ని రాకెట్ స్పీడుతో పూర్తి చేస్తూనే అదే స్పీడుతో మిగతా చిత్రాలని కూడా పరుగులు పెట్టిస్తున్నారు. `ఆచార్య` తరువాత వరుస రీమేక్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన మెగాస్టార్ ప్రస్తుతం వాటిని పూర్తి చేసే పనిలో ఎక్కడా తగ్గట్లేదు. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ హీరో తల అజిత్ నటించిన బ్లాక్ బస్టర్ `వేదాలం` రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే.`భోళా శంకర్` పేరుతో రూపొందుతున్న ఈ మూవీకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కీర్తి సురేష్ తమన్నాల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అన్నా చెల్లెలు సెంటిమెంట్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో మెగాస్టార్‌కు చెల్లెలుగా టాలెంటెడ్ నటి కీర్తి సురేష్ నటిస్తోంది. మెగా మాసీవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన తాజా డిటైల్స్‌ని చిత్ర బృందం ట్విట్టర్ వేదికగా బుధవారం వెల్లడించింది.

మెగాస్టార్ పాల్గొనగా స్టైలిష్ ఫైట్ ని పూర్తి చేశామని అలాగే ఓ భారీ సెట్‌లో ఓ పాటని కూడా పూర్తి చేసినట్టుగా ప్రకటించారు. సెట్లో దర్శకుడు మెహర్ రమేష్ డ్యాన్స్ మాస్టర్ శేఖర్ కు సూచనలిస్తున్న ఓ ఫొటోని షేర్ చేసిన చిత్ర బృందం సెకండ్ షెడ్యూల్‌ని కూడా ఇప్పటికే ప్రారంభించేశామని వెల్లడించింది. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్న ఈ మూవీకి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం