Begin typing your search above and press return to search.

'భీష్మపర్వం' టీజర్: వెటరన్ గ్యాంగ్ స్టర్ గా ఆకట్టుకున్న మెగాస్టార్..!

By:  Tupaki Desk   |   12 Feb 2022 4:43 PM GMT
భీష్మపర్వం టీజర్: వెటరన్ గ్యాంగ్ స్టర్ గా ఆకట్టుకున్న మెగాస్టార్..!
X
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. డబ్బింగ్ సినిమాలతో తెలుగులో కూడా క్రేజ్ ఏర్పరచుకున్నారు. 'సూర్య పుత్రులు' 'స్వాతి కిరణం' 'యాత్ర' వంటి స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లోనూ నటించారు. గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ వద్ద సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న మమ్ముట్టి.. తాజాగా ''భీష్మపర్వం'' అనే సినిమాతో వస్తున్నారు.

''భీష్మ పర్వం'' చిత్రాన్ని అమల్ నీరద్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా మార్చ్ 3న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయి నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ లో మమ్ముట్టి వెటరన్ గ్యాంగ్ స్టర్ మైఖేల్ గా కనిపిస్తున్నారు. బ్లాక్ డ్రెస్ లో లాంగ్ హెయిర్ తో సరికొత్త మేకోవర్ లో కనిపించి ఆకట్టుకున్నారు.

మెరైన్ ఎక్స్ పోర్ట్ బిజినెస్ చేసుకునే మాజీ గ్యాంగ్ స్టర్ మైఖేల్.. తన కుటుంబానికి శత్రువుల నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదుర్కోడానికి మళ్ళీ పాత జీవితంలోకి అడుగుపెడతాడు. ఈ క్రమంలో అతనికి ఎలాంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి.. శత్రువులను ఎలా అంతం చేసాడు అనేదే ''భీష్మ పర్వం'' కథాంశం అని తెలుస్తోంది.

టీజర్ లో స్లో మోషన్ షాట్ లు మరియు ఎలివేషన్ డైలాగ్ అభిమానులను అలరిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దీనికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇందులో అర్జున్ సర్జా - టబు - అంజలి - షైన్ టామ్ చాకో - జిను జోసెఫ్ - దిలీష్ పోత్తన్ - సౌబిన్ షాహిర్లతో పాటు అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషిస్తోంది. అనసూయకు ఇది తొలి మలయాళ సినిమా.

మమ్ముట్టి - అమల్ నీరద్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'బిగ్ బీ' చిత్రం ఘనవిజయం సాధించింది. మళ్లీ 15 ఏళ్ళ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న ''భీష్మ పర్వం'' సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మూవీ టీజర్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా మలయాళ మెగాస్టార్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.