టీజర్ టాక్: నా అన్న..మన్నెం దొర..అల్లూరి

Fri Mar 27 2020 16:03:31 GMT+0530 (IST)

Bheem For Ramaraju

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR' మోషన్ పోస్టర్ ను.. 'రౌద్రం రణం రుధిరం' అనే పూర్తి టైటిల్ ను ఉగాది పర్వదినం సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే.  ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ గిఫ్ట్ ఇస్తానని ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రకటించారు.  తన మాట నిలబెట్టుకుంటూ 'భీమ్ ఫర్ రామరాజు - RRR' అనే ఒక టీజర్ ను కాసేపటి క్రితం విడుదల చేశారు ఎన్టీఆర్.  "నేను మాటిచ్చిన విధంగా ఇస్తున్నాను.  హ్యాపీ బర్త్ డే బ్రదర్! మన బంధం ఎప్పటికీ కొనసాగాలి" అంటూ ట్వీట్ చేశారు.ఇక టీజర్ విషయానికి వస్తే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తూ "ఆడు కనవడితే నిప్పుకణం నిలవడినట్టుంటది.. కలవడితే ఏగుచుక్క ఎగబడినట్టుంటది. ఎదురుబడితే సావుకైనా సెమ్ట ధారకడ్తది. ప్రాణమైనా.. బందూకైనా వానికి బాంచనైతది... ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి.. నా అన్న. మన్నెం దొర. అల్లూరి సీతారామరాజు" అంటూ చెప్పే డైలాగ్స్ వింటుంటే ఎవరికైనా గూసు బంప్సు.. అదేనండీ ఒళ్ళు పులకరించక మానదు.  డైలాగ్ స్టార్ట్ చేసిన విధానం.. పాజ్ ఇస్తూ వాయిస్ లో పిచ్ పెంచుతూ తగ్గిస్తూ చివరికి "నా అన్న" అంటూ చరణ్ పాత్ర పేరు చెప్పడం కేకోకేకస్య కేకోభ్యః.

ఇక విజువల్స్ స్టన్నింగ్ అనే చెప్పాలి. షర్టు లేకుండా జస్ట్ పోలీసు ప్యాంట్ తో మెడలో ఓం లాకెట్ ఉండే దండ.. జంధ్యంతో కఠిన కసరత్తులు చేస్తూ చరణ్ ను చూపించిన విధానం మామూలుగా లేదు. విజిల్స్ మోగిపోయేలా ఉంది. చరణ్ ఫిట్నెస్ పీక్స్ లో ఉండడంతో ఆ ఎక్సర్ సైజులు చేసే సమయంలో ఒక యోధుడి తరహాలో కనిపిస్తున్నాడు. నిప్పుకణికలా చరణ్ ను చూపించడం.. అందుకు ఫైర్ ఎలిమెంట్ ను వాడుకోవడం సూపర్ గా సింక్ అయింది.  ఇక కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చరణ్ పాత్రను పూర్తిగా ఎలివేట్ చేస్తూ అద్భుతంగా సాగింది.  ఒక్క ముక్కలో చెప్పాలంటే చరణ్ కు పర్ఫెక్ట్ బర్త్ డే గిఫ్ట్.. ఆలస్యం ఎందుకు చూసేయండి.. భీమ్ ఫర్ రామరాజు.