బుగ్గలు గిల్లిన హీరోయిన్లు.. అస్సలు ముద్దు చేయట్లేదట!

Sun Apr 21 2019 11:13:23 GMT+0530 (IST)

Bharath on About ABCD Movie

చూసినంతనే.. క్యూట్ అంటూ ముద్దు చేసే హీరోయిన్లు.. ఎప్పుడూ ఒకేలా ఉండరు కదా. బుజ్జిగా ఉంటే చిన్న బాబు కనిపిస్తే.. హీరోయిన్ ఏంటి? ఎవరైనా ముద్దు చేస్తారు. మరి.. ఆ బుజ్జిబాబు పెద్దబాబు అయితే.. ఆ ముద్దు చేయటాలు వగైరాలు ఏమీ ఉండవు కదా.  టాలీవుడ్‌లో బాల నటుడిగా అందరికి సుపరిచితుడు.. చూసినంతనే గుర్తు పట్టే బాలనటుడు భరత్.భరత్ అంటే అర్థం కాకపోవచ్చుకానీ.. చిట్టినాయుడన్న పేరు విన్నంతనే ప్రతి ఒక్కరి ముఖం మీదన నవ్వులు పూయిటమే కాదు.. ఓ.. ఆ భరతా? అనేయటం చాలామందినే చూస్తాం. మరి.. ఆ భరత్ ఇప్పుడు కుర్రాడు అయిపోయాడు. చిన్నప్పుడు బొద్దుగా.. ముద్దుగా ఉండే అతగాడు ఇప్పుడు స్లిమ్ కావటమే కాదు.. గుర్తు పట్టేలేని రీతిలో మారిపోయాడు. మొన్నటి వరకూ మాస్టర్ భరత్ అన్నోళ్లు ఇప్పుడు మిస్టర్ భరత్ అనే పరిస్థితి.

తాజాగా అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ఏబీసీడీలో భరత్.. హీరో స్నేహితుడి పాత్రను పోషిస్తున్నారు. చూసినంతనే ఏ మాత్రం గుర్తు పట్టలేని రీతిలో తయారైన అతగాడి నోటి వెంట ఆసక్తికరమైన మాటను చెప్పుకొచ్చారు. అప్పటికి ఇప్పటికి సెట్ లో వచ్చిన మార్పు ఏమిటంటే.. అప్పట్లో హీరోయిన్లు అంతా బుగ్గలు గిల్లి.. ముద్దు చేసే వాళ్లు.. ఇప్పుడు ముద్దు చేయట్లేదంటూ నవ్వేశారు. ఇదే విషయాన్ని అల్లు శిరీష్ కూడా అంటూ ఆటపట్టిస్తారని చెప్పుకొచ్చాడు.